Read more!

English | Telugu

జబర్దస్త్ వర్ష ఇంట్లో దెయ్యం.. షాకైన నెటిజన్లు!


కొన్ని సంఘటనలు వింటేనే భయపడతాం.. మరికొన్ని చూస్తుంటే భయపడతాం. కానీ అలాంటి భయానక సంఘటనలని దగ్గర నుండి చూస్తే మరింతగా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. జబర్దస్త్ వర్ష ఇంట్లో దెయ్యం కన్పించిందంట. దాని గురించి చెప్తూ వర్ష తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ చేయగా అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

బుల్లితెరపై వర్ష తన అందంతో తిరుగులేని ఫాలోయింగ్, క్రేజ్‌ను దక్కించుకుంది. యాక్టింగ్,డ్యాన్స్ ఇలా అన్నింట్లో నెటిజన్లు ఆమెకు తక్కువ మార్కులు వేస్తుంటారు. కానీ అందంలో మాత్రం ఎక్స్‌ట్రా మార్కులు వేస్తుంటారు. అలా వర్ష తన అందాల ప్రదర్శనతో నెట్టింట్లో దుమ్ములేపేస్తుంటుంది. బుల్లితెరపై సీరియల్స్‌తో ప్రయాణం మొదలుపెట్టి.. జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చింది వర్ష. ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీగా తిరుగుని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. గత ఆరేడేళ్లుగా జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తోంది. పండుగ ఈవెంట్లు, బుల్లితెరపై షోలు అంటూ బాగానే బిజీగా ఉంటోంది. ఇక నెట్టింట్లో వర్ష తన అందాలను ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు.

మా ఇంట్లో దెయ్యాన్ని చూసాను అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది వర్ష. తను ఉదయం లేచి బయటకొచ్చి చూసేసరికి రీసెంట్ గా వాల్స్ కి చేసిన డెకరేషన్ ఊడిపోయిందంట. అదేదో గాలికి ఊడిపోయిపోయిందనుకున్నా కానీ తన టెడ్డీ బేర్ మెడ కోసేసి ఉండటం చూసి షాకైందంట. ఇక తను ఇంట్లో సెట్ చేసుకున్న లైట్ సెటప్ డిమ్ అవ్వడం.. ఆ లైట్స్ కి ఉండే వైరింగ్ అంతా కాలిపోవడం చూపించింది వర్ష. ఇలా తను ఉండే రూమ్ లో ఏవేవో వింతలు జరుగుతున్నాయంటు, చాలా భయంభయంగా ఉందని.. ఇవేవి నిజాలు కాకపోతే బాగుండు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది వర్ష. దాంతో ఈ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది  చూసిన నెటిజన్లు వర్షని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారంటు కొంతమంది నెటిజన్లు కామెంట్లతో తమ స్పందనలు తెలియజేస్తున్నారు.