English | Telugu

వంద ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!


బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా సీరియల్స్ కి విశేషమైన ఆదరణ ఉంది. అందులోను‌ కొత్తగా మొదలైన 'ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఈ సీరియల్ మొదలై సరిగ్గా వంద ఎపిసోడ్‌లు అయింది. దాంతో ఈ సీరియల్ మేకర్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ‌ప్రోమో రిలీజ్ అవుతే చాలు.. గంటలోపే వేలల్లో వ్యూస్ వస్తాయి. అంతలా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ లో రక్ష నింబార్గి, సీతాకాంత్ ల ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిధా అయ్యారనే చెప్పాలి. రోజుకో ట్విస్ట్ తో సాగే ఈ సీరియల్ లో మాణిక్యం, సిరి, ధన, శ్రీలత, సందీప్, అభి, రామలక్ష్మి, సీతాకాంత్ ఇలా అందరు తమ పాత్రలకి న్యాయం చేస్తున్నారు. గత జన్మలో ప్రేమించుకొని విడిపోయిన రామలక్ష్మి, సీతాకాంత్.. ఈ జన్నలోనైనా కలుస్తారా లేదా అనే కథాంశంతో మొదలైన ఈ కథ.. మొదటి ఎపిసోడ్ నుండి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అందులోను ఇద్దరి భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలు.. అయితే రామలక్ష్మికి ముందుగానే అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉండటంతో కథలో మెలిక మొదలైంది. అభి వాళ్ళింటికి సీతాకాంత్ వెళ్ళి అక్కడ అన్నీ విషయాలు తెలుసుకుంటాడు.

ఇక అభికి గుణపాఠం చెప్పడానికి ఫేక్ కరెన్సీ నోట్లు ఇవ్వడం.. పోలీసులు అభిని తీసుకెళ్ళడంతో కథ ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని రామలక్ష్మికి అపరిచితురాలిగా శ్రీలత ఫోన్ చేసి చెప్తుంది. దాంతో సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగియగా.. ఆ అపరిచితురాలు ఎవరా అనే డౌట్ సీతాకాంత్ లో మొదలైంది. మరోవైపు అభి మోసగాడని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పగలడా లేదా అనేది ఉత్కంఠభరితంగా మారింది. ఇలా ఈ సీరియల్ ప్రస్తుతం వంద ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ లో రక్ష నింబార్గి అమాయకత్వం , గంభీరంగా ఉండే సీతాకాంత్, కన్నింగ్ మెంటాలిటితో శ్రీలత, సందీప్ మెప్పిస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.