English | Telugu

నల్ల చేప వచ్చె.. ముప్పు తెచ్చె!

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతోన్న టాస్క్ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. కెప్టెన్ ఎవరో తేల్చే ఈ టాస్క్ లో బాగా పర్ఫామెన్స్ ఇచ్చినవాళ్ళు కెప్టెన్ అవుతారు. కాగా పర్ఫామెన్స్ ఇచ్చేవాళ్ళని ఎదో ఒక లింక్ పెట్టి కెప్టెన్సీ పోటీ తప్పిస్తోన్నారు కొందరు కంటెస్టెంట్స్. గత రెండు రోజుల నుండి హౌస్ లో చేపల వర్షం కురుస్తుంది అనే విషయం తెలిసిందే. కాగా మొన్నటి రోజు అంతా చేపలను కాపాడుకోవడం, వాటిని సంపాదించుకోవడం మధ్యలో గోల్డ్ కాయిన్ వీటితో గడిచింది.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ వేక్ అప్ సాంగ్ వేయగా అందరూ బయటకొచ్చి డ్యాన్స్ చేసారు. అయితే అప్పటికే పూల్ లో ఉన్న నల్ల చేపని గీతు చూసి తీసేసుకొంది. డ్యాన్స్ చేసే వారిలో ఫైమా, మెరీనా ఉండగా వారు దానిని పట్టించుకోలేదు. కాగా గీతు మాత్రం దానిని తీసుకొని దాచిపెట్టుకుంది. హౌస్ లో జరిగే ట్విస్ట్ లు బాగానే ఉంటాయి. ఆ తర్వాత "బజర్ మోగే సమయానికి ఏ జంట దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయో" లెక్కించమంటాడు బిగ్ బాస్. "అలాగే నల్ల చేప ఎవరి దగ్గర ఉంటుందో, వారికీ ఒక స్పెషల్ పవర్ లభిస్తుంది" అని బిగ్ బాస్ చెప్పడంతో, గీతూ తన దగ్గర ఉన్న నల్లచేపను తీసుకొచ్చింది. ఒక జంట ని ఇంకో జంటతో స్వాప్ చెయ్యమని గీతూకి చెప్పగా అందరికంటే ఎక్కువగా ఉన్న జంట రేవంత్, ఇనయాను అందరికంటే తక్కువ ఉన్న శ్రీహాన్, శ్రీసత్యతో స్వాప్ చేస్తున్న" అని గీతు చెప్పింది. గీతు, ఆదిరెడ్డితో, "ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో ఇలా చేస్తే, వాళ్ళు విడిపోతారు. ఆట మజా ఉంటుంది" అని చెప్పుకొచ్చింది. కానీ రేవంత్, ఇనయా రెండు రోజులుగా చాలా కష్టపడి ఆడారు. కాగా వాళ్ళకి బాధతో కూడా కోపం వచ్చి కొంచెం గట్టిగానే ఆర్గుమెంట్ జరిగింది అని చెప్పాలి.

హౌస్ లో వచ్చిన నల్ల చేప వల్ల రేవంత్, ఇనయ ఇద్దరు స్వాప్ చేయబడ్డారు. కాగా ఈ టాస్క్ లో ఏమైనా మార్పులు చేసి ఈ జంటకి అవకాశం ఇస్తారో? లేదో? చూడాలి మరి.