English | Telugu
అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్.. కారణం శ్రీసత్యనే!
Updated : Oct 28, 2022
బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయిన అర్జున్ కళ్యాణ్ తెలుసుకదా!.. ఎప్పుడూ శ్రీసత్య చుట్టూ తిరుగుతూ, శ్రీసత్య కోసమే బిగ్ బాస్ లోకి వచ్చినట్టుగా కనిపించిన అర్జున్. గతవారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చాడు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కి రాకముందు, ఎవరికి తెలియని వ్యక్తి. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఇతను కూడా ఒక హీరో అన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది.
అర్జున్ వైజాగ్ లో జన్మించాడు. గీతం కాలేజీలో చదివాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి, అక్కడ M.S చేసాడు. ఆ తర్వాత ఫిల్మ్ కోర్స్ చేసాడు. చిన్నప్పటి నుండి సినిమాలు అంటే మక్కువతో మొదటగా షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. 'మిస్సమ్మ', 'ఆత్మరామ', 'గీత గోవిందం', 'నారి నారి నడుమ మురారి'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
2013 లో 'చిన్న సినిమా' అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కాగా 'ప్రేమమ్', 'వరుడు కావలెను' వంటి సినిమాలలో నటించాడు. అయితే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒక ఆడియో ఫంక్షన్ లో అర్జున్ కి యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ గురించి మాట్లాడం టాక్ అఫ్ ది టౌన్ గా మారి, పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే మొదట్లో ప్రేక్షకులు ఆశించినంతగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. టాస్క్ లో, గేమ్ లో ఎలాంటి వాటిలోను తను ఒక్కసారి కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో, వేస్ట్ కంటెస్టెంట్ గా, అన్‌డిజర్వింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే హౌస్ లో శ్రీసత్యతో క్రష్ ఉండేది. ఎక్కువగా హౌస్ లో తన కోసమే ఆడినట్లుగా అనిపించేది. ఇక శ్రీసత్యని వదిలి, గేమ్ పై ఫోకస్ పెడుతున్నాడు అనేసరికి హౌస్ లో నుండి బయటకొచ్చేసాడు.
బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఒకడిగా ఉంటాడనుకున్న అర్జున్ ఎలిమినేట్ అవ్వడంతో, ఈ షో చూసే ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. అర్జున్ ఓటింగ్ పోల్ లో మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ ఎలా ఎలిమినేట్ చేస్తారని నెటిజన్లు కామెంట్లు చేసారు. "అర్జున్ కి అన్యాయం జరిగింది" అంటు తెగ ట్రోల్స్ చేసారు. ఇది చాలా అన్‌ఫెయిర్ అంటు నెటిజన్లు పోస్ట్ లతో, ట్వీట్లతో వైరల్ చేసారు.
కాగా ఏడవ వారం హౌస్ నుండి బయటకొచ్చేసిన అర్జున్, తను బయటికి రావడానికి కారణం ఒక రకంగా శ్రీసత్యనే అని అంటున్నాడు.టాస్క్ లో పర్ఫామెన్స్ లేకపోగా, గేమ్ లో పోరాడే ఆసక్తి లేనట్లు, ఎప్పుడు చూసినా శ్రీసత్య కోసమే అన్నట్టుగా ఉండటం వల్ల బిగ్ బాస్ నుండి కావాలని పంపించేసారని బయట ప్రచారం జరుగుతోంది. అర్జున్ కి రెమ్యూనరేషన్ కూడా తక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకి రోజుకి ఇరవై వేల వరకు ఉండొచ్చని బయట ప్రచారంలో ఉంది.