English | Telugu
'బిగ్ బాస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ'!
Updated : Oct 18, 2022
బిగ్ హౌస్ లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. కంటెస్టెంట్స్ ఎవరిని అయితే నామినేట్ చేస్తారో వారి పేరు చెప్పి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వాళ్ళు ఒంటి మీద కలర్ నీళ్లు పోసుకోవడం జరుగుతోంది. కాగా హౌస్ లో అతి మంచిగా పిలువబడే ఆదిత్య మీద ఎక్కువ సార్లు కలర్ నీళ్లు పడడం జరిగింది.
హౌస్ మేట్స్ లో సగం మంది కూడా లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో బ్యాటరీ మొత్తం వాడుకొని మిగతా సభ్యుల గురించి ఆలోచించలేదు. ఈ విషయం పైనే అందరు నామినెట్ చేసారు ఆదిత్యని. మొదటగా ఫైమా నామినేట్ చెయ్యగ, తరువాత శ్రీసత్య చేసింది. శ్రీసత్య రీజన్ మాట్లాడుతూ, "నువ్వు ఎప్పటిదో ఇష్యూ తీసుకొచ్చి నాకు ఓటు వేయకపోవడం వల్ల నాకు కెప్టెన్ అయ్యే అవకాశం పోయింది. అందుకే నామినేట్ చేస్తున్నా" అని శ్రీసత్య చెప్పింది.
ఆ తర్వాత వచ్చిన గీతు కూడా ఆదిత్యని నామినేట్ చేసింది. తను నామినేట్ చేసాక రీజన్ చెప్పుకొచ్చింది. "బిగ్ బాస్ హౌస్ లో మరీ ఇంత మంచిగా ఉండేవాళ్ళు ఉంటే బాగోదు. 'bigboss is not yourcup of tea' అని గీతూ అనగా, "నేను నీకు సమాధానం చెప్పదలుచుకోలేదు" అని అనేసి వెళ్ళిపోయాడు.
కానీ హౌస్ లో ఎక్కువ మందితో అన్న అని పిలిపించుకొనే వ్యక్తి ఆదిత్య. అలాంటిది అందరు అతన్ని నామినేట్ చేస్తుంటే ఒక రకమైన బాధతో కనిపించాడు. అయితే బాధలో కొన్ని ఎమోషనల్ గా మాట్లాడాడు. "నేను ఏ హౌస్ గురించి అయితే ఆలోచించానో, అదే హౌస్ నాకు ఇప్పుడు చాలా కొత్తగా అర్ధమౌతోంది. నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్ లో చూపించినప్పుడు అది అర్ధం కాలేదు ఇప్పుడు అర్ధం అవుతుంది" అంటు ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ వారం ఆటలో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.ఆదిత్యకి హౌస్ లో అందరు నెగటివ్ గా ఉన్నా, ప్రేక్షకులు ఓట్లు వేసి సేవ్ చేస్తారో లేదో చూడాలి మరి.