English | Telugu

లైఫ్ లాంగ్ వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేస్తాను!

బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది వారాలు వీర లెవెల్లో గేమ్ ఆడి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన గలాటా గీతూ రాయల్ బీబీ కేఫ్ లో పార్టిసిపేట్ చేసి ఎన్నో విషయాలు చెప్పింది. "నీకు నోటి దురుసు.. హౌస్ లో అరిస్తే బయటకు వినిపించేది".. అని యాంకర్ అడిగేసరికి "ఇనయాతో గొడవపెట్టుకున్నది ఫస్ట్ వీక్ లో. బాలాదిత్య నన్ను ఎన్ని మాటలు అన్నా నేను సైలెంట్ గా ఉన్నా, ఆదిరెడ్డితో వాదన పెట్టుకున్నా అంతే.. నాకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తా.. నాది నటన కాదు.. నేను ఏదైనా పాయింట్ మాట్లాడతాను. రేవంత్ మాత్రం అలా కాదు.. చాలా ఎగ్రెసివ్.. బాలాదిత్యకు సిగరెట్లు ఇవ్వకపోవడం వలన నేను ఆడియన్స్ లో బాగా నెగటివ్ అయ్యానని అనుకుంటున్నా. ఇక హౌస్ లో ఆదిరెడ్డి నన్ను బాగా అర్థం చేసుకున్న మంచి మిత్రుడు. అని చెప్పింది.

అందరూ తను గేమ్ ఆడలేదని చెప్తున్నారని, తను సాధ్యమైనంతవరకు గేమ్ ఆడాననీ ఆమె అంది. "నాలో నచ్చని విషయాలను చెప్పినప్పుడు మార్చుకుంటూ వచ్చాను. నేనేమన్నా క్రిమినల్‌నా మారడానికి! బిగ్ బాస్ హౌస్ కి వచ్చాకే మనుషుల విలువ, ఫుడ్ వేల్యూ, టైం వేల్యూ అన్నీ తెలిసాయి. మెరీనా ఫుడ్ బాగా చేస్తుంది దాని గురించన్నా హౌస్ నుంచి బయటికి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్లి తినేసి వస్తా. అని చెప్పింది గీతూ.

కానీ మెరీనాతో, రోహిత్ తో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేయననేది ఆమె మాట. "ఆదిరెడ్డి, శ్రీసత్య, బాలాదిత్య, శ్రీహాన్, ఫైమా వీళ్ళను లైఫ్ లాంగ్ వదలను. రాజు లాస్ట్ లో నాకు కనెక్ట్ అయ్యాడు. కానీ ఒక్కో నిమిషం ఒక్కోలా ఆలోచిస్తాడు. ఇనయాతో నేను ఉండాలనుకోవట్లేదు. రేవంత్ తో సిట్యువేషన్ బట్టి ఫ్రెండ్ షిప్ చేస్తాను. వసంతి గేమ్ నాకు బాగా అర్థం కాలేదు. కీర్తి భట్ నాకు పెద్దగా సింక్ అవలేదు" అని హౌస్ నుంచి బయటికి వచ్చే కంటెస్టెంట్స్ తో ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తుంది, ఎవరితో చేయదు వంటి విషయాలను పంచుకుంది చిత్తూర్ చిరుత.