English | Telugu
త్వరలో మన పెళ్లి షాపింగ్ చేద్దాం!
Updated : Nov 8, 2022
'జబర్దస్త్' కమెడియన్స్ వర్ష, ఇమ్ము నిన్న మొన్నటి వరకు ఫుల్ ఫైట్ చేసుకున్నారు. కానీ అంతలోనే కలిసిపోయారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ ఐపోయారు. తన లవ్ లో ఫస్ట్ టైంవర్షకి గిఫ్ట్ ఇచ్చేసాడు ఇమ్ము. వచ్చే నెల వర్ష పుట్టినరోజు రానున్న సందర్భంగా కొంచెం ముందుగానే హైదరాబాద్ లోని ఓ జ్యూవలరీ షోరూంకి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు.
"గోల్డ్ ఇస్తే ఎక్కువవుతుందని ఇక్కడికి తీసుకొచ్చావా?" అని వర్ష అడిగితే, "నీకు గోల్డ్ కూడా ఉందిరా. అది ఇప్పుడు కాదు. మన పెళ్లికి. పెళ్లి షాపింగ్ కూడా చేస్తామండి త్వరలోనే. మా పిల్లల్ని కూడా చూపిస్తాం." అని ఇమ్ము జోక్ వేశాడు. దీనికి వర్ష పగలబడి నవ్వింది.
"నా పక్కన ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.. వర్ష అందానికి ఎప్పుడూ ఫిదా ఐపోతూ ఉంటాను" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు ఇమ్ము. నెక్లెస్, వడ్డాణం.. అవన్నీ కొనిపెట్టాడు. ఇకపోతే రీసెంట్ గా కారు కొన్న ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు వర్షకి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.