English | Telugu
రాత్రి పూట దుప్పటి కప్పుకొని ఏడ్చాను!
Updated : Oct 16, 2022
బిగ్ బాస్ హౌస్ కొత్త కొత్త టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. గీతుని కన్ఫెషన్ రూం కి వెళ్ళమని చెప్పి కాసేపు ఆటపట్టించాడు.
కన్ఫెషన్ రూం అనే పేరు చెప్పగానే కంటెస్టెంట్స్ అందరు ఒకరకమైన భయానికి లోనవుతోంటారు, దీనికి అందులో ఇచ్చే సీక్రెట్ టాస్క్ ముఖ్య కారణం. అయితే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే ప్రకియలో భాగంగా నిన్న శ్రీసత్య సేవ్ అయింది. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ఆటతీరుకి, గుడ్, యావరేజ్, డెడ్ అనే మూడు ఇచ్చాడు. గీతు మాటతీరుకి గుడ్, కానీ ఆట సరిగ్గా ఆడనందుకు యావరేజ్ ఇచ్చాడు నాగార్జున.
గీతు "నేను కన్ఫెషన్ రూం కి వెళ్తాను సర్" అని చెప్పగా నాగార్జున సరే అన్నాడు. గీతు కన్పేషన్ రూం కి వెళ్ళాక, "ఎందుకమ్మ గేమ్ అలా ఆడావ్" అని అనగా, "వేస్ట్ సర్. అది తుప్పాస్ టాస్క్" అని చెప్పింది. "గీతు కి తగిన టాస్క్ లు వస్తేనే కదా సర్, పర్ఫామెన్స్ చేసేది. అలాగే బిగ్ బాస్ తో ఛాలెంజ్ చేస్తున్న సర్, ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ నన్ను కొట్టి పడేస్తా అంది. అక్కడ నాకు పాజిటివ్ వైబ్ రాలేదని కొంచెం అనిపించింది. ఎక్కడ ఆదిరెడ్డి నాకు దూరం అవుతాడోనని, రాత్రి పూట దుప్పటి కప్పుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చాను సర్. బిగ్ బాస్ ఫ్యామిలీ ఎమోషనస్ కి విలువ ఇచ్చే విధానం నాకు బాగా నచ్చింది. ఈ సీజనే కాకుండా నెక్ట్ సీజన్ కూడా బిగ్ బాస్ కి వస్తాను సర్. కొంచెం రికమెండేషన్ చేయండి." అని చెప్పుకొచ్చింది గీతు. కాగా " డెఫినెట్లీ రికమెండేషన్ డన్. నిన్ను అస్సలు తీసుకురావొద్దని బిగ్ బాస్ కి చెబుతాను" అని నాగార్జున సరదగా అన్నాడు. తర్వాత "ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాట తీరు కొంచెం రూడ్ గా అనిపిస్తోంది. అది ఒక్కటి చూస్కో" అని నాగార్జున ఒక టిప్ ఇచ్చాడు గీతు కి.