English | Telugu

'రాయబారమై' వన్ మినిట్ మ్యూజిక్ కి రీల్స్ ని ఇన్వైట్ చేసిన కాంబో సింగర్స్ సునీత, సత్యాయామిని!

"నీలి నీలి కళ్ళలోని చిన్ని చిన్ని ఆశాలేవో అల్లుకున్నవి".. ఇన్స్టాగ్రామ్ లో దూసుకుపోతున్న ఒక రొమాంటింక్ సాంగ్. ఇద్దరు అద్భుతమైన సింగర్స్ కలిస్తే ఆ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..ఐతే ఇన్స్టాగ్రామ్ లో సునీత ఈ మధ్య వన్ మినిట్ మ్యూజిక్ పేరుతో హాష్ టాగ్ క్రియేట్ చేసి "రాయబారమై" అంటూ ఒక సాంగ్ పాడారు. నిజం చెప్పాలంటే ఈ సాంగ్ విన్న ఎవరైనా మైమరిచిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు సింగర్ సునీతతో మరో సింగర్ సత్యాయామిని కొలాబరేట్ అవుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అనౌన్స్ చేశారు.

అలాగే ఈ పాటకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయని చెప్పారు. ప్రేక్షకులు ఈ మినిట్ మ్యూజిక్ ని ఆదరించి పెద్ద సక్సెస్ చేసినందుకు తన పేజీ ద్వారా సునీత విషెస్ చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ "వన్ మినిట్ మ్యూజిక్ రాయబారమై" అనే సాంగ్ కి రీల్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు ఈ సింగర్స్ ఇద్దరూ కలిసి. ఐతే రీల్స్ చేసి "హాష్ టాగ్ వన్ మినిట్ మ్యూజిక్" అని పెట్టి ఈ సింగర్స్ ని టాగ్ చేయమని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కోరారు. "ఈ సాంగ్ తో మీరేం చేస్తారో మేం చూస్తాం" అంటూ అనౌన్స్ చేశారు. దానికి ఇక నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

"సునీత, సత్య యామిని కాంబో అదుర్స్ , వండర్ ఫుల్" అంటూ కామెంట్స్ చేశారు. మరి ఈ సాంగ్ మీరు కూడా విన్నారు కదా. మీకు నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం ఒక అద్భుతమైన రీల్ చేసేసి ఆ ఇద్దరి సింగర్స్ ని ట్యాగ్ చేసేయండి...ఏమో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో తెలీదు కదా. ఈ సాంగ్ తో మీరు కూడా ఫేమ్ తెచుకోవచ్చేమో... ట్రై చేసేయండి మరి