English | Telugu
కంటెస్టెంట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!
Updated : Oct 16, 2022
బిగ్ బాస్ హౌస్ లో నిన్న మొన్నటిదాకా జరిగిన బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో రోహిత్ ఏడ్చాడు. అది ఎవరు పట్టించుకోకుండా, ఎవరికి వాళ్ళు తమ సొంత ప్రయోజనం చూసుకోవడంతో కంటెస్టెంట్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
అయితే మొన్న జరిగిన టాస్క్ లో బ్యాటరీ మొత్తం జీరో అయింది. అప్పుడు " మీలో ఒకరు రానున్న రెండు వారాలు వరుసగా నామినేషన్లో ఉండటానికి సిద్ధపడితే బ్యాటరీ మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవుతుంది" అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వివరించాడు. కాగా ఈ త్యాగానికి రోహిత్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ తమ అవకాశాలను వినియోగించుకోగా, ఒక్కరు కూడా రోహిత్ ని మీ వల్లే మాకు అవకాశం వచ్చింది మొదట మీరు తీసుకోండి ఛాన్స్ అని ఎవరు అనకపోవడంతో, నాగార్జున గట్టిగా అడిగాడు. దీంతో తప్పు చేసినట్టు అందరు తలదించుకొన్నారు.
ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, మీరెవరూ రోహిత్ త్యాగాన్ని గుర్తించనందుకు మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు తీసుకుంటారో చెప్పండని అనగా వసంతి నేను తీసుకుంటానని ఒప్పుకుంది. తర్వాత పనిష్మెంట్ కోసం కన్ఫెషన్ రూంలోకి వెళ్ళిన వసంతికి బిగ్ బాస్ "Cut your Hair Up to shoulder " అని చెప్పగా అలాగే అని ఒప్పుకొంది. ఈ పనిష్మెంట్ మీ అందరికీ, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని నాగార్జున చెప్పుకొచ్చాడు.