English | Telugu

వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న గుప్పెడంత మనసు!

తెలుగు బుల్లితెర ధారావాహికల్లో‌ స్టార్ మా టీవీ సీరియళ్స్ కి అత్యధిక టీఆర్పీ రేటగ్ వస్తోంది‌. అయితే ఇందులో ప్రస్తుతం బ్రహ్మముడి టాప్ లో ఉండగా.. కృష్ణ ముకంద మురారి సెకెండ్, గుప్పెడంత మనసు సీరియల్ మూడవ స్థానంలో ఉన్నాయి. అయితే వీటిల్లో గుప్పెడంత మనసుకి గత మూడు సంవత్సరాలుగా ఫ్యాన్ క్రేజ్ ఉంది.

గుప్పెడంత మనసులోని రిషి, వసుధారల ప్రేమకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మొదట డీబీఎస్టీ కాలేజీలో ఓ స్టూడెంట్ గా పరిచయం అయిన వసుధార.. అదే కాలేజీలోని జగతి మేడమ్ ని ఇంప్రెస్ చేసింది. కొన్ని రోజులకి అదే కాలేజీలో గోల్డ్ మెడల్ పొందిన మొదటి ర్యాంక్ స్టూడెంట్ గా అందరిచేత ప్రశంసలు పొందింది. ఇక మెల్లమెల్లగా వసుధార, రిషీల మధ్య గొడవలు, ఈగోలు వెరసి ప్రేమగా మారింది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అలా ఒకరినొకరు కొన్ని రోజులు ప్రేమించుకున్నాక జగతి మేడమ్ వారి ప్రేమని అంగీకారించింది. కొంతకాలం తర్వాత దేవయాని కొడుకు శైలేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. అతడికి కాలేజీలో ఎండీ సీట్ మీద ఉన్న కోరికతో జగతి మేడమ్ ని చంపించేశాడు. ఇక తర్వాత తను ఎండీ అవుదామని అనుకుంటే రిషి వసుధారని ఏండీని చేశాడు. ఇక ప్రతీదానికి అడ్డుగా ఉన్న రిషిని రౌడీలతో కొట్టించాడు శైలేంద్ర.

ఇక తాజా ఎపిసోడ్ లలో గాయాలతో ఉన్న రిషిని చూపించిన డైరెక్టర్.. మరికొన్ని రోజులలో అతడు షూటింగ్ లో పాల్గొంటాడని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసి మరీ చెప్పాడు. అయితే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ 1000 ఎపిసోడ్‌ లు పూర్తి చేసుకుంది. అయితే రిషి అలియాస్ ముఖేశ్ గౌడ ఈ అరుదైన ఘనతను పొందిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ ఓ పోస్ట్ చేశాడు. కాగా త్వరలోనే రిషి వస్తాడని ఎదురుచూస్తున్న గుప్పెడంత మనసు ప్రేక్షకుల కల నెరవేరుతుందని అందరు కోరుకుంటున్నారు.‌ కాగా వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సీరీయల్ యూనిట్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.