Read more!

English | Telugu

కొత్త కెప్టెన్ గౌతమ్ కృష్ణ.. తనని నామినేట్ చేసినవాడికి శివాజీ సాయం!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఎనిమిదవ వారం హౌస్ లో‌ 'బిబి మారథాన్' టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలని సూచించిన బిగ్ బాస్.. వారికి రకరకాల టాస్క్ లని ఇచ్చాడు.

అయితే మొదటి గేమ్ లో ప్రియంకజైన్ గెలిచింది. రెండవ గేమ్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఇక మూడవ గేమ్ లో ఆట సందీప్ గెలిచాడు. నాల్గవ గేమ్ లో గౌతమ్ కృష్ణ, అయిదవ గేమ్ లో శోభాశెట్టి గెలిచింది. ఇలా అయిదు గేమ్ లలో గెలిచిన ఈ అయిదుగురికి ' ఈ మిర్చీ హాట్' అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇదేంటంటే హౌస్ లో కెప్టెన్సీ రేస్ లో లేని మిగిలిన కంటెస్టెంట్స్ సరైన కారణం చెప్తూ కెప్టెన్ గా ఎవరు అనర్హులని భావిస్తున్నారో వారికి మిర్చీ దండని వేయాలని సూచించాడు బిగ్ బాస్. మొదట పల్లవి ప్రశాంత్ ‌కి మిర్చీ దండ వేసి కెప్టెన్సీ రేస్ నుండి తప్పించాడు అమర్ దీప్. ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి పల్లవి ప్రశాంత్ కి మిర్చీ దండ వేశాడు. మూడవ బజర్ నొక్కాడు భోలే షావలి. ఇక ప్రియాంక జైన్ కి మిర్చీ దండ వేసి కెప్టెన్సీ రేస్ నుండి తప్పచాడు. కాసేపటికి అశ్వినిశ్రీ కూడా వచ్చి ప్రియాంకకి మిర్చీ దండ వేసింది.  శోభాశెట్టికి యావర్ మిర్చీ దండ వేసి కెప్టెన్సీకి అనర్హురాలివని చెప్పాడు. అది శోభాశెట్టి తీసుకోకుండా పెద్ద గొడవ చేసింది. 

ఆ తర్వాత శోభాశెట్టికి రతిక మిర్చీ దండ వేసింది. ఇలాంటి మాటతీరు కెప్టెన్ కి ఉండకూడదని రతిక అనగా.. నేను ఇలానే ఉంటానని శోభాశెట్టి అంది. ఇక అందరికి మిర్చీ దండలు పడగా ఆట సందీప్, గౌతమ్ కృష్ణ మిగిలారు. ఆట సందీప్ కి అంబటి అర్జున్ మిర్చీ దండ వేసి.. బలంతో పాటు బలగం కూడా కావాలనేది నా పాయింట్, నో హార్ట్ ఫీలింగ్ అని చెప్పి సందీప్ కి మిర్చీ దండని వేశాడు. ‌ఇక మిగిలిన చివరి డిసైడింగ్ ఓట్ శీవాజీకి దక్కింది. దాంతో శివాజీ ఒక్కటే చెప్పాడు.. మనం అందరం కలిసి గొడవలు లేకుండా ఇచ్చేద్దాం.

ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ ఉంటే నేను తప్పుకొని కచ్చితంగా నీకే ఇస్తా సందీప్. ఈసారి గౌతమ్ కి కెప్టెన్సీ ఇస్తున్నా అని చెప్పి సందీప్ మెడలో మిర్చీ దండ వేశాడు శివాజీ. అందరు కలిసి శివాజీ లేనప్పుడు తక్కువ చేసి మాట్లాడిన, శివాజీని అన్ డిజర్వింగ్ అని గౌతమ్ కృష్ణ నామినేట్ చేసిన క్షమించి వదిలేశాడు శివాజీ. ఇక ఎనిమిదవ వారం కెప్టెన్సీ భాద్యతలు తీసుకున్నాడు గౌతమ్ కృష్ణ. ఆ తర్వాత స్పాన్సర్స్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో టేస్టీ తేజకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో థియేటర్ ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ, స్ప్రైట్ తాగుతు చిల్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్ బాస్.