English | Telugu
కలర్ ది ఏముంది..కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి
Updated : Oct 28, 2023
బుల్లితెరను ఫాలో అయ్యేవాళ్ళకు పటాస్ ఫైమా అన్నా జబర్దస్త్ ఫైమా అన్న తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు. నెమ్మదిగా ఎదుగుతూ ఒక్కో షోలో తన టాలెంట్ ని బయట పెడుతూ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అక్కడ కూడా ఎంటర్టైన్ చేసి ఒక పవర్ఫుల్ లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈమె కొన్ని మూవీస్ లో చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈమె ‘తెలుగు మీడియం ఇస్కూల్ ’పేరుతో ప్రతీ ఆదివారం వస్తున్న రియాలిటీ షో షూటింగ్‌లో పాల్గొన్న ఫైమా చాలా ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. అప్పారావు, మహేష్ విట్టా, గోమతి, అరియానా, రష్మీ, ఫైమా, భద్రం, రంగస్థలం మహేష్ వంటి పాపులర్ తెలుగు కమెడియన్లు మెంటర్స్ జాబితాలో ఉన్నారు. అమెరికాకు చెందిన అలీజా, స్కాట్లాండ్కు చెందిన సామి జోనాస్ హీనీ, జపాన్కు చెందిన సుయోషి యమమోటో సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ తెలుగు నేర్చుకునే స్టూడెంట్స్ టీమ్ లో ఉన్నారు.
యాంకర్ రవి, డాన్సర్ పండు ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. ఐతే ఫైమా కలర్ గురించి చెప్తూ “ఇప్పటికీ నా కలర్ గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఈ విషయాన్నీ విని బాధపడేదాన్ని. ఇప్పుడైతే ఆ కామెంట్స్ ని పట్టించుకోవడం మానేశాను. మార్పు అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. ఎవ్వరూ మనకు సాయం చేయరు . మనం పడిపోతే నవ్వే వాళ్ళు తప్ప.. చెయ్యి ఇచ్చి పైకి లేపే వాళ్ళు ఉండరు. మనకు మనమే లేచి మన కాళ్ళ మీద నిలబడాలి..ఒక్కసారి మనం డిసైడ్ అవ్వాలి అంతే ఎవ్వరి మాటా వినకూడదు..నాలో ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు వస్తుంది అంటే ఒకప్పుడు జరిగిన సిట్యుయేషన్స్ లో నేను అక్కడే ఆగిపోతే ఇప్పుడు ఇప్పుడు నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో అందుకే నాలో ఇంత కాన్ఫిడెంట్" అని చెప్పింది ఫైమా.