English | Telugu
అనిల్ రావిపూడి ఎఫ్ 4 మూవీ..సుమ కాళ్ళు పట్టుకుని బ్రేకప్ కి ఒకే చెప్పాలంటూ...
Updated : Mar 2, 2025
అనిల్ రావిపూడి మూవీస్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫుల్ ఫన్నీ బేస్డ్ ఉంటాయి, ఫామిలీ ఎంటర్టైనర్స్ కూడా...ఐతే ఇప్పుడు అనిల్ ఇప్పుడు సుమతో ఎఫ్ 4 తీయబోతున్నారు అనే విషయం తెలుస్తోంది. ఐతే ఇంతలో ఏమయ్యిందో ఏమో కానీ అనిల్ రావిపూడి తాగొచ్చి సుమకి ఫోన్ చేసి "బ్రేకప్" అని చెప్పేసరికి సుమ షాకయ్యింది. "అసలు సుమా నీకోసం ఎంత చేసినా...అట్లెట్ల వదిలేసావ్ నన్ను.. వంద సార్లు చెప్తా బ్రేకప్...నేను నీకు ఇచ్చిన గిఫ్తులన్నీ పంపీ..వెనక్కి పంపావా..వద్దులే మళ్ళీ నీకు పంపించేస్తా..నువ్వే ఉంచుకో..నీ గిఫ్టులు నాకెందుకు..బ్రేకప్.. అసలు లైఫ్ లో నీతో మాట్లాడితే, నీకు ఫోన్ చేస్తే అడుగు..ఏంటో ఫోన్ చేయొద్దంటావా..మళ్ళీ మళ్ళీ చేస్తా నా ఇష్టం. నీ పేరు పొడిపించుకున్నా కదే చేతి మీదా..ఆ టాటూ పోదు..లైఫ్ టైం పర్మనెంట్ గా ఉంటుంది. బ్రేకప్ అని నీ కాళ్ళు పెట్టుకుంటా ఓకే చెప్పొచ్చుగా..ప్లీజ్ ప్లీజ్ ఇంకొక్క ఛాన్స్ ..ఇంకెప్పుడూ ఇలా చెయ్య...హే పోవే ఎవడిక్కావాలి నువ్వు ..బ్రేకప్ " అని అనిల్ రావిపూడి అంటే "సరే ఎన్ని సార్లు చెప్తావ్ బ్రేకప్ అసలు నాకోసం ఎం చేసావ్.. బ్రేకప్ చెప్పి నా ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో అవుతున్నావ్. ఐనా నీ గిఫ్తులన్నీ నీకు వెనక్కి పంపేసినా..చూసుకో..ఐనా ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నావ్. ఎవరు పొడిపించుకోమన్నారు పచ్చబొట్టు. అది మూడు నెలల్లో పోయే టాటూ అని నాకు తెలీదా...ఐనా లైఫ్ టైం పరిమెంట్ టాటూ ఎవరు వేయించుకోమన్నారు తీసేయ్..బ్రేకప్ ఎన్ని సార్లు చెప్తావ్..వంద సార్లు చెప్పావ్..." అంటూ సుమ కౌంటర్లు వేసింది.