English | Telugu

'జబర్దస్త్' ఆర్టిస్ట్ పేరుతో ఫేక్‌ అకౌంట్! హెచ్చ‌రించిన త‌న్మ‌యి!!

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. అందులో ఖాతాలు లేని వారెవరూ ఉండరు. సెలబ్రిటీల నుండి సాధారణ ప్రజల వరకు ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు మాత్రం నకిలీ ఖాతాలతో రెచ్చిపోతున్నారు. ఇది సెలబ్రిటీలకు అప్పుడప్పుడు తలనొప్పిగా మారుతుంటుంది. ఇప్పుడైతే వెరిఫైడ్ అకౌంట్ అనే ఆప్షన్ రావడంతో సెలబ్రిటీల అకౌంట్లను సులువుగా పోల్చే అవకాశం ఉంది.

అయితే కొందరు సెలబ్రిటీలకు బ్లూ టిక్స్ ఉండవు. సాధారణ వ్యక్తుల మాదిరి వారి ఖాతాలు ఉంటాయి. అలాంటి వారిని ఆకతాయిలు టార్గెట్ చేస్తున్నారు. కొందరు హ్యాకింగ్‌లకు పాల్పడుతుంటే.. ఇంకొందరు నకిలీ ఖాతాలతో జనాలను బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా 'జబర్దస్త్' షోలో లేడీ గెటప్పులతో ఫేమస్ అయిన తన్మయికి ఆకతాయిలు షాకిచ్చారు.

ఆమె పేరుతో ఓ నకిలీ ఖాతాను ఓపెన్ చేశారు. దీంతో ఆ ఖాతా త‌న్మయిదే అనుకొని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయం తన్మయికి తెలియడంతో తన అభిమానులను హెచ్చరించింది. ఆ ఫేక్ అకౌంట్ డీటైల్స్ షేర్ చేస్తూ.. ఇది నకిలీ ఖాతా అని ఎవరూ నమ్మొద్దని చెప్పింది. చాట్ చేయొద్దని తన ఫాలోవర్లకు సూచించింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...