English | Telugu

ప్రియ‌మ‌ణికి హైపర్ ఆది లవ్ లెటర్.. చదివి వినిపించిన ప్రదీప్!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోలు బాగా పెరిగిపోయాయి. వెండితెర స్టార్స్ సైతం టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాబోయే బుధవారం టెలికాస్ట్ కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. యాంకర్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్ లతో పాటు జడ్జిలు ప్రియమణి, పూర్ణ చేసిన హడావిడి మాములుగా లేదు.

ఓ కంటెస్టెంట్ డాన్స్ పెర్ఫార్మన్స్ కు ముగ్ధురాలైన‌ పూర్ణ నేరుగా స్టేజ్ పైకి వెళ్లి అతడి బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఇక హైపర్ ఆది రాసిన లవ్ లెటర్ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది. ఈ లెటర్‌ను ప్రదీప్ చదివి వినిపించాడు. స‌హ‌ యాంకర్ దీపికను ఉద్దేశిస్తూ ఆది లెటర్ రాశాడు. ''దీపికా దీపికా నీ గురించి రాయడానికి నాకు లేదు ఓపిక..'' అంటూ కౌంటర్లు వేశాడు. అలానే ప్రియమణిని ఉద్దేశిస్తూ.. "ప్రియా నిన్ను చూడగానే పడిపోయా.." అంటూ రాసిన కవితను ప్రదీప్ తన స్టైల్ లో చదివి నవ్వించాడు.

ఆదితో పాటు సుడిగాలి సుధీర్ కూడా లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్ ను చూడాలని ఉందా..? అంటూ ప్రదీప్ ఆసక్తికి క్రియేట్ చేశాడు. ప్రోమోలో అయితే లెట‌ర్‌ను వినిపించలేదు. సుధీర్ ఏం రాశాడో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే! మొత్తానికి ఇలాంటి ఆస‌క్తిక‌ర స్కిట్స్‌తో ఢీ 13 దూసుకుపోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.