English | Telugu
కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ రోజు ఏం జరిగిందో తెలుసా?
Updated : Aug 26, 2023
ఫైమా పటాస్.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికీ సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చింది. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో తనేంటో నిరూపించుకుంది. అలా బుల్లితెరపై నవ్వులు పూయించిన ఫైమాకి బిగ్ బాస్ సీజన్-6 లో అవకాశం లభించింది.
బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టిన ఫైమా.. హౌస్ లో నవ్వులు పూయించింది. అయితే ఒకానొక దశలో తను వేసే పంచులు ఎదుటివారిని ఇబ్బంది పెడతాయని అప్పుడే తెలిసింది. దాంతో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఫైమాకి అలా వెటకారంగా మాట్లాడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయిన తను మారలేదు. దాంతో ప్రేక్షకులలో ఫైమాపై నెగెటివ్ ఇంపాక్ట్ కలిగిందనే చెప్పాలి. దాంతో బిగ్ బాస్ వీక్లీ వైజ్ ఎలిమినేషన్ లో ఫైమా బయటకొచ్చింది. అయితే ఫైమా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ఆ ఫ్యాన్స్ ఫైమా బయటకొచ్చాక గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్పారు. దీంతో అందరి దృష్టి ఫైమా మీద పడింది. అలా ఫైమా ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆ తర్వాత బిబి జోడీలో సూర్య తో కలిసి డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. దీంతో ఫైమాకి ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అయితే ఫైమా తన గురించి ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది..
తాజాగా కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. దానికి బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు. కాగా అందులో కొంతమంది తమ తమ పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ బిజీ ఉండగా, కీర్తిభట్ కి తల్లితండ్రులు స్థానంలో మెరీనా, రోహిత్ ఉండి ఎంగేజ్ మెంట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఫైమా తన పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో 'కీర్తిభట్ ఎంగేజ్ మెంట్ రోజు ఏం జరిగిందో తెలుసా' అనే వ్లాగ్ ని చేసింది. ఇందులో ఫైమా ఎంగేజ్ మెంట్ కి లేట్ గా వెళ్ళిందంట. అక్కడ వాసంతి కృష్ణన్, రాజ్, ఆదిరెడ్డి, మెరీనా రోహిత్ లతో కాసేపు మాట్లాడుతూ వ్లాగ్ చేసింది. రాజ్ గురించి ఫైమా మాట్లాడుతూ.. మేమిద్దరం ఎప్పుడు గొడవపడుతుంటాం. ఒక నెల మాట్లాడుకుంటాం. మూడు నెలలు మాట్లాడుకోమని ఫైమా అంది. కాగా మా అందరిలో అటిట్యూడ్ ఎవరికి ఎక్కువ ఉంటుందనంటే అందరు ఫైమానే అంటారని రాజ్ అన్నాడు. ఇలా ఫైమా అక్కడ తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి సరదగా గడిపింది. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.