English | Telugu
హౌస్ లో కొత్త కెప్టెన్ ఫైమా!
Updated : Nov 12, 2022
బిగ్ బాస్ హౌస్ లో ప్రతీవారం కెప్టెన్ లు మారుతు ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ వారం కొత్త కెప్టెన్ వచ్చేసారు. గత వారం నుండి శ్రీసత్య కెప్టెన్ గా ఉండగా, ఈ వారం ఫైమా ఎన్నికైంది.
నిన్న మొన్నటి వరకు సాగిన 'స్నేక్-లాడర్', 'నాగమణి' టాస్క్ లలో ఓడిపోయిన కంటెస్టెంట్స్ ని పక్కన పెడితే, 'కీర్తి భట్, శ్రీసత్య, ఫైమా, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి' మిగాలారు. అయితే ఈ కంటెస్టెంట్స్ చివరి గేమ్ అయిన 'బస్తాలో బాల్స్' టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో చివరగా శ్రీసత్య, ఫైమా ఉన్నారు. ఫైమా తన స్ట్రాటజీ ఉపయోగించి శ్రీసత్య బస్తాలోని బాల్స్ ని పడేసింది. బజర్ మోగేవరకు ఫైమా బస్తాలో బాల్స్ ఎక్కువగా ఉండటం వల్ల, సంచాలకులుగా వ్యవహరిస్తున్న రేవంత్ ఫైమాని విజేతగా ప్రకటించి, బిగ్ బాస్ కి తెలియజేసాడు. దీంతో హౌస్ లోకి కొత్త కెప్టెన్ గా ఫైమా ఎన్నుకోబడింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు చప్పట్లతో అభినందనలు తెలిపారు. "లోకంలో గొప్పది ప్రేమ..మా ఇంటికి కెప్టెన్ ఫైమా" అని ఆదిత్య గట్టిగా చెప్పగా, హౌస్ మేట్స్ ఓ అంటూ అరిచారు.
ఆ తర్వాత ఫైమా కెప్టెన్ అయ్యింది. "అందరికి చెబుతున్నా ఈ వీక్ అందరికి అన్నీ చేకూరేలా, పర్ఫెక్ట్ కెప్టెన్ గా ఉంటానని చెబుతున్నాను" అని ఫైమా, హౌస్ మేట్స్ ని ఉద్దేశించి చెప్పింది. మొదటి సారి కెప్టెన్ అయ్యనందుకు గాను ఫైమా అందరికి థాంక్స్ చెప్పింది. ఈ మధ్య ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫైమా, కెప్టెన్ గా తన భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుందో? లేదో? చూడాలి మరి.