English | Telugu
నువ్వెంత పులిహోర కలిపినా నేను నీకు పడను!
Updated : Nov 12, 2022
జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ సౌమ్యా రావు వచ్చింది. ఐతేఈమె ప్రస్తుతానికి పర్వాలేదనిపించేలా చేస్తోంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. "కొత్తగా వచ్చిందో లేదు అప్పుడే ఆది ట్రాక్ వేయడం స్టార్ట్ చేసాడు", "సౌమ్య వాయిస్ వేరే లెవెల్".. ఇలా అంటూ ఆమె యాంకరింగ్‌కి నెమ్మదిగా అలవాటుపడుతున్నారు ఆడియన్స్.
ఇక నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సౌమ్య బుట్టబొమ్మ సాంగ్‌కి రెడ్ కలర్ డ్రెస్‌లో డాన్స్ వేస్తూ వచ్చింది. ఇంతలో ఆది స్టేజి మీదకు వచ్చి "నువ్వొక్కదానివే చేస్తే ఉత్తి బొమ్మ అవుతుంది.. నాతో కలిసి చేస్తేనే బుట్టబొమ్మఅవుతుంది" అని పంచ్ వేసాడు.
"నువ్వెంత పులిహార కలిపినా నేను నీకు పడను" అని యాంకర్ సౌమ్య కూడా సీరియస్ గానే చెప్పింది. "ఛాలెంజా.. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలుసు కదా!" అని ఆది రివర్స్ అనేసరికి, "చిరంజీవి గారు కాదు కదా" అని టైమింగ్‌తో రివర్స్ పంచ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.
స్టేజి మీద ఎవరేం మాట్లాడినా, కామెంట్ చేసినా సౌమ్య రావు కూడా స్ట్రైట్ గానే కౌంటర్లు పేల్చేస్తోంది. దాంతో ప్రస్తుతానికి బాగానే యాంకరింగ్ చేస్తొందనే అభిప్రాయం కలిగిస్తోంది.