English | Telugu
వాళ్ళిద్దరి ప్రేమ స్టేజి వరకే.. ఫైమా దృష్టి అంతా కెరీర్ మీదే!
Updated : Sep 16, 2022
పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ ఫైమా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ ఐన పర్సన్స్. ఫైమా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ స్టేజి పై ప్రవీణ్ రాసిన ఫన్నీ ప్రేమలేఖను చదివి హౌస్ లోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారంటూ చాలా షోస్ లో చెప్పిన విషయం తెలిసిందే. ఐతే ఇటీవల వీళ్ళ పెళ్లి విషయం గురించి ఫైమా వాళ్ళ అమ్మ కొన్ని ఆసక్తికర విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "ప్రస్తుతానికి మా అమ్మాయి కాన్సంట్రేషన్ అంతా కెరీర్ మీదే ఉంది" అని చెప్పింది.
మరి సోషల్ మీడియాలో ప్రవీణ్ తో ప్రేమ విషయం వార్తల గురించిఏంటి అంటూ ఆమెను ప్రశ్నించగా.. "అదంతా స్టేజి వరకే.. ప్రేమ, పెళ్లి అంటూ ఇంట్లో మాకెవ్వరికీ చెప్పలేదు" అంటూ క్లారిటీ ఇచ్చేసింది. "ప్రవీణ్ మా ఇంట్లో కలిసిపోతాడు. ఎందుకంటే మాకు కొడుకులు లేరు కాబట్టి అతను కూడా కొడుకు లెక్క మంచిగా ఉంటాడు" అంది ఫైమా వాళ్ళ అమ్మ. ఐతే ఆడియన్స్ కి కూడా ఫైమా కొంచెం కొంచెంగా నచ్చుతోంది. అటు జబర్దస్త్ లోనూ ఆమెకు మంచి సపోర్ట్ దొరుకుతోంది. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఆటకు ఆడియన్స్ కూడా ఓట్లేసి ఆమెను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.