English | Telugu
ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ..
Updated : Sep 16, 2022
బిగ్ బాస్ సీజన్ 6 అలా చక్కగా సాగిపోతోంది. ఐతే బిగ్ బాస్ ఈసారి హౌస్ మేట్స్ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పడిన ఇబ్బందులను చెప్పమని అడిగేసరికి అందరూ వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ స్టోరీస్ చెప్పుకొచ్చారు. ముందుగా సుదీప మాట్లాడింది . తాను ప్రెగ్నెంట్ గా ఉన్న టైములో థైరాయిడ్ సమస్య వల్ల బేబీని పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పింది. ఇక కీర్తి మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన భయంకరమైన సంఘటనలు గురించి చెప్పింది . దేవాలయానికి వెళ్లి వస్తూ.. తన కుంటుంబం అంతా కారు యాక్సిడెంట్ లో మరణించారని. ఫ్యామిలీ మొత్తం మీద తాను ఒక్కతినే బతికాకాని అసలెందుకు ఎందుకు బతికానురా దేవుడా అనుకున్నానంటూ ఏడ్చేసి.. హౌస్ లో అందరిని ఏడిపించేసింది కీర్తి. బంధువులు కూడా తన ఆస్తిని తీసుకుని తనను రోడ్డు మీద వదిలేశారంటూ బాధపడింది.
ఇంట్లో వాళ్లంతా చనిపోయాక ఒక పాపను దత్తత తీసుకుందని చెప్పింది. తాను బిగ్ బాస్ హౌస్ కు వచ్చే ముందు ఆ బిడ్డకు వచ్చిన అనారోగ్య సమస్య వలన ఆమె కూడా చనిపోయిందని చెప్పింది. పోనీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారనే ఆశ కూడా లేదని ఎందుకంటే యాక్సిడెంట్ లో తన గర్బసంచి తీసేశారంటూ.. కీర్తి చెపుతుంటే.. హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా ఉన్న మెరీనా జంట కూడా ఎమోషనల్ స్టోరీ చెప్పారు. మెరీనాకు రెండు సార్లు అబార్షన్ అయ్యిందని. లాక్ డౌన్ టైంలో చాలా నరకం చూసిందని కన్నీళ్లు పెట్టుకుని చెప్పాడు రోహిత్. మరో పక్క సింగర్ రేవంత్ వాళ్ళ స్టోరీ వింటూ చాలా బాధపడ్డాడు. ఇక అభినయశ్రీ ఈసారి మంచి పాప పుడుతుంది అంటూ రోహిత్, మెరీనాకు ధైర్యం చెప్పింది . ఇలా హౌస్ మేట్స్ అంతా వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ స్టోరీస్ ని చెప్పుకొచ్చారు.