English | Telugu

ఈ సూపర్ మామ్ ఎప్పుడూ నా సెల్ డీపీగా ఉంటుంది!

వన్యప్రాణి ప్రేమికులకు "కాలర్‌వాలి" అనే పులి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని అందరూ ముద్దుగా "మాతారాం" అని పిలుచుకుంటారు. ఈ పులి సుమారు 16 ఏళ్లకు పైగా బతికి 29 పిల్లలకు జన్మనిచ్చింది. అందుకే ఈ పులిని "సూపర్ మామ్" అని కూడా అంటారు. లాస్ట్ ఇయర్ ఈ పులి చనిపోయింది. దానికి ఘనంగా అంత్యక్రియలు కూడా జరిగాయి. ఇప్పుడు ఎందుకు దీని గురించి చెప్తున్నా అనుకుంటున్నారు కదా..."నీతోనే డాన్స్" షోకి వచ్చే జడ్జ్ సదా గురించి అందరికీ తెలుసు. ఆమె రెగ్యులర్ గా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకరి సలహా మేరకు "అసలు సదా ఫోన్ లో ఏముంది" అనే టాపిక్ పైన చేయమన్నారట..అందుకే ఈ వీడియో చేశారు సదా.

సదాకి వన్యప్రాణులంటే చాలా ఇష్టం. ఆమె సెల్ డిపిగా "మాతారం" పిక్ ని పెట్టుకున్నట్టు చూపించారు. ఐతే తాను ఈ పిక్ ని తియ్యలేదు అని చెప్పారు. అలాగే ఈ పులిని కండిషన్ లో అస్సలు చూడలేకపోయానని బాధపడ్డారు. చనిపోయే ముందు మాత్రమే చూశానని చెప్పారు. జనవరి 2022 నుంచి ఈ పులిని తన డిపిగా పెట్టుకున్నట్లు చెప్పారు. అలాగే మాయ, వీర అనే పులులు కూడా తన మనసులో స్తానం సంపాదించుకున్నాయి అని అన్నారు. ఇక తన సెల్ లో ఎక్కువ రీల్స్ అన్ని పులుల మీదే ఉంటాయి అని వాటిని కూడా చూపించారు. ఇంకా తన ఫేస్బుక్ పేజీని, ఇన్స్టాగ్రామ్ పేజీని ఇలా అన్ని చూపించారు. నోట్స్ అనే ఫోల్డర్ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ గురించిన నోట్స్ ఎక్కువగా రాసుకుంటానని అది తనకు ఎంతో ఇష్టం అని అన్నారు. అలాగే ఇంట్లో తాను పెంచుకునే పిల్లులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి ఇంట్లో సీసీ కెమెరాలను ఫిక్స్ చేయించానని వాటిని తన సెల్ వీడియో ఆప్షన్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటానన్నారు. ఇక తన కాల్ లిస్ట్ లో ఎక్కువగా తన మదర్ కి కాల్ చేస్తాను అని చూపించారు. ఇలా తన ఫోన్ లో ఏమేమి ఉన్నాయో చూపించారు సదా .

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.