English | Telugu

కృష్ణభగవాన్ మీద ప్రవీణ్ పంచ్..నువ్వు ఆ రాయి ఇచ్చాకే కిడ్నీలో రాళ్లు వచ్చాయంటూ కౌంటర్

ఎక్స్ట్రా జబర్దస్త్ లో పటాస్ ప్రవీణ్ మంచి కామెడీ స్కిట్ వేసాడు. కృష్ణ భగవాన్ మీద కామెడీ చేద్దాం అనుకున్నాడు కానీ అది రివర్స్ లో ప్రవీణ్ కే తెగిలింది. రంగురాళ్లు అమ్ముకునే అబ్బాయి క్యారెక్టర్ చేసాడు. "ఈ బీచ్ పేరేమిటో తెలుసా..మెరీనా బీచ్ కానీ అప్పుడప్పుడు రష్మీ వచ్చేసరికి రష్మీ బీచ్ ఐపోయింది" అని ప్రవీణ్ చెప్పేసరికి రష్మీ షాకైపోయింది. "ఈ బీచ్ లో నాకు రంగు రాళ్ళ బిజినెస్ ఒకటి ఉంది.. ఈ రాళ్లు పెట్టుకున్నవాళ్లంతా ఎక్కడో ఉన్నారు తెల్సా రష్మిగారు" అనేసరికి "అవునా" అంది రష్మీ. "అంతెందుకండి ఈ అమ్మాయి వెనక ఒక అబ్బాయి అలా గాలికి తిరిగేవాడు..అలా గాలికి తిరుగుతున్నాడని ఒక రింగ్ పెట్టా...గాలోడై ఇప్పుడు హిట్ కొట్టి రష్మీ కూడా దొరక్కుండా తిరుగుతున్నాడు" అంటూ ప్రవీణ్ సుడిగాలి సుధీర్ మీద ఒక పంచ్ వేసాడు.

"ఒకసారి కృష్ణ భగవాన్ గారు అలా వచ్చి బీచ్ దగ్గర ఆలోచిస్తూ ఉన్నారు" ఏమైంది సర్ అని నేను అడిగితే పంచులు సరిగ్గా వేయలేకపోతున్నాను" అన్నారు .."దానికి నేను వెంటనే ఒక పచ్చ రాయి తీసి పెట్టా" అన్నాడు ప్రవీణ్. " ఆ రాయిని పెట్టుకున్నాకే కిడ్నీలో రాళ్ళోచ్చాయి" అని రివర్స్ లో కృష్ణ భగవాన్ కౌంటర్ వేసేసరికి పటాస్ ప్రవీణ్ నాలుక్కరుచుకున్నాడు. ఇక జడ్జ్ ఖుష్బూ గురించి చెప్పబోతూ ఉండగా "నాకు తెలుసు నువ్వు నా దగ్గరకే వస్తావ్ అని..ఇదిగో నా చేతులకు ఉన్నాయి రంగురాళ్లు" అని చూపించేసరికి ప్రవీణ్ వేయాల్సిన కౌంటర్లు కి ఫుల్ స్టాప్ పెట్టేసాడు. ఫైనల్ గా అన్ని అమ్మేశాక మిగిలిన ఒక్క రింగును చూపిస్తూ "రష్మీ గారు ఒక్క రింగు తీసుకోండి మీ షష్ఠిపూర్తికి ఐనా పనికొస్తుంది" అనేసరికి రష్మీ సీరియస్ లుక్ ఒకటి ఇచ్చేసింది. దాంతో ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.