English | Telugu
ఫైమా ఆమెను ప్రేమిస్తోందట!
Updated : Jun 18, 2023
పటాస్ ఫైమా గురించి అందరికి తెలుసు.. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా తక్కువ కాలంలోనే పాపులర్ ఐపోయింది. ఫైమా వేసే పంచ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వాటి మీద మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతో ఫైమా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలా జబర్దస్త్ లో చేస్తుండగానే బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. హౌస్ లోకి వెళ్లి అక్కడ కూడా అందరిని ఎంటర్టైన్ చేసి బయటికి వచ్చింది. ఇప్పుడు "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోలో శ్రీముఖితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అలాంటి ఫైమా రెగ్యులర్ గా ఫాన్స్ తో టచ్ ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ లో క్వశ్చన్స్ అడగమని చెప్తూ తాను కూడా సరదాగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది ఫైమా. అలాంటి ఫైమాని ఇప్పుడు ఆరియానా లవ్ చేస్తోందట. "ఐ లవ్ యు..డు యు లవ్ మీ" అని ఆరియానా అడిగేసరికి "ఐ లవ్ యు టూ...ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా సిస్టర్" అని ఆన్సర్ చేసింది. "ఎప్పుడూ శారీ ఎందుకు..దిష్టి తగులుతుంది బాబోయ్" అని ఒక ఫ్యాన్ అనేసరికి "థ్యాంక్యూ" అని చెప్పింది. "నువ్వు కలిసిన పెద్ద సెలబ్రిటీ పిక్ పెట్టు" అనేసరికి "ఆలీతో కలిసి దిగిన ఫోటోని పెట్టింది. "రాజ్ లో నచ్చే ఒక మంచి క్వాలిటీ చెప్పండి" అని అడగగా, "నన్ను భరిస్తాడు..ఫ్రెండ్ షిప్ కి వేల్యూ ఇస్తాడు" అంది ఫైమా. "బిగ్ బాస్ హౌస్ లో నచ్చని, నచ్చే హౌస్ మేట్ ఎవరు" అనే ప్రశ్నకు " అలా ఎవరూ లేరు ఎందుకు అంటే అది గేమ్ షో కాబట్టి" అని సమాధానమిచ్చింది.
పటాస్ షోలో ఫైమా తన కామెడీతో దూసుకుపోతున్న టైంలో అనుకోకుండా ఆ షో ఆగిపోయింది. దాంతో ఫైమా తన యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉండిపోయింది. సరిగ్గా అదే టైంలో జబర్ధస్త్ షో ఆఫర్ వచ్చింది. అలా తర్వాత ఫైమా వెనుదిరిగి చూసుకోలేదు. కామెడీ టైమింగ్.. భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష, ఫైమా మధ్య వచ్చే కామెడీ స్కిట్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవారు.