English | Telugu
అసలు నిజం చెప్పమని జగతిపై కోప్పడ్డ మహేంద్ర!
Updated : Jun 18, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -792లో.. రిషి గురించి బాధపడుతుంది జగతి. రిషి ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తూ ఉంటుంది. రిషి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుందని లెక్కలు వేసుకుంటుంది. అంతలోనే ధరణి అక్కడికి వస్తుంది. ఇలా ఎన్ని రోజులని రిషి కోసం ఎదురు చూస్తారు అత్తయ్య అని ధరణి అడుగుతుంది. ఇంతకు మించి ఏం చెయ్యగలను. నా కొడుకు గురించి వెతకని ప్లేస్ లేదు. ఇంక ఎప్పుడు వస్తాడు. ఇంకా ఎన్ని రోజులు చూడాలని జగతి అంటుంది.
ఆ తర్వాత మీరు ఒక పని చెయ్యాలి. అది చేస్తే కచ్చితంగా రిషి తిరిగి వస్తాడని ధరణి అనగానే.. ఏం చెయ్యాలో చెప్పు ధరణి.. నా కొడుకు గురించి ఏం చెయ్యడానికైనా నేను రెడీ అని జగతి అంటుంది. రిషి గురించి పేపర్ లో గాని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ గాని ఇవ్వాలని ధరణి అనగానే.. వద్దు అలా చేస్తే రిషి ఎప్పటికి రాడని జగతి అంటుంది. నేను చేసింది మంచి కోసమే అని భావిస్తే రిషి తప్పకుండా వస్తాడని జగతి అంటుంది. అప్పుడే మహేంద్ర విని కోపంగా.. జగతి, ధరణిల దగ్గరికి వస్తాడు. నా కొడుకుని నాకు దూరం చేసింది నువ్వు. ఇన్నాళ్లుగా నా కొడుకుని ఎందుకు దోషిగా దూరంగా పంపించేసావ్.. అసలు నిజం చెప్పకుండా ఎందుకు ఇలా బాధపెడుతున్నావని మహేంద్ర అంటాడు. బలమైన కారణం ఉంటేనే అలా చేయాల్సి వచ్చిందని జగతి అంటుంది. ఆ బలమైన కారణం ఏంటో చెప్పమను ధరణి అని మహేంద్ర ఆవేశపడుతాడు. "నాకు జగతి దగ్గర అయ్యిందని అనుకునే లోపే నా కొడుకుని జగతే దూరం చేసింది" అని మహేంద్ర అంటాడు. అలా మహేంద్ర అన్న మాటలకు జగతి బాధపడుతుంది.
మరొకవైపు వసుధార మనసులో నుండి తనని తాను దూరం చేయాలని రిషి అనుకుంటాడు. వసుధార కాలేజీలో అనుకోకుండా రిషిని చూసి ఆశ్చర్యపోతుంది. వసుధార ఎదురుగా రిషి గుండుతో ఉంటాడు. గుండు ని కవర్ చేస్తూ క్యాప్ లో ఉన్న రిషిని చూసి.. సర్ అని వసుధార తన చేతిలో ఉన్న బుక్ ని కిందపడేస్తుంది. మేడం మీ బుక్ అని రిషి వసుధారకి ఇస్తాడు. తనపై ఇక ప్రేమ లేదు అనేలా వసుధారతో రిషి మాట్లాడి వెళ్ళిపోతాడు. వసుధార మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది. మరొక వైపు నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు జగతి.. ఎవరైనా కుట్ర చేసి ఇదంతా చేసారా అని ఫణింద్ర జగతిని అడుగుతాడు. జగతి ఏం సమాధానం చెప్పదు. అప్పుడే మినిస్టర్ జగతికి కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.