English | Telugu

కావ్యని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 125 లో.. రాహుల్-స్వప్నల పెళ్ళి జరిగాక అప్పగింతల్లో కనకం ఎమోషనల్ అవుతుంది. ఇక నువ్వు నీ ఇంట్లోనే ఉండాలని స్వప్నతో చెప్తూ కనకం ఏడ్చేస్తుంది. అప్పగింతలు జరిగాక కనకం కుటుంబం అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత స్వప్నని కావ్య గదిలోకి తీసుకెళ్లి బెడ్ పై కోపంగా నెట్టివేస్తుంది. ఏంటి అలా నెట్టేస్తున్నావ్ కడుపులో నా బిడ్డ ఏం కావాలని స్వప్న అంటుంది. "నీ కడుపులో బిడ్డా? సరే అయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి నిన్ను చూపిస్తాను" అంటూ కావ్య కోప్పడుతుంది. కావ్య అలా అనగానే స్వప్న షాక్ అవుతుంది. నన్ను ఎందుకు ఇలా మోసం చేసావ్? అసలు నీకు కడుపే లేదు. ఎందుకు అబద్ధాం చెప్పావని కావ్య నిలదీస్తుంది. నేను అబద్దం చెప్పానని నీకెవ్వరు చెప్పారని స్వప్న అడుగుతుంది. అరుణ్ నీ ఫోన్ కి కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేసానని కావ్య అంటుంది. అవును అబద్ధం చెప్పాను.. రాహుల్ నన్ను చీట్ చేసి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నేను ఈ ఇంటికి ఎలాగైనా కోడలు కావాలని ఇలా చేశాను. చెల్లుకి చెల్లు అని స్వప్న అంటుంది. నిజం తెలియక నీ తరుపున నిలబడి దగ్గరుండి నీ పెళ్లి జరిపించాను. రాజ్ కి తెలిస్తే జీవితంలో నన్ను క్షమించడు. వెంటనే వెళ్లి రాజ్ కి నిజం చెప్తానని కావ్య వెళ్తుంటే.. స్వప్న తనని ఆపి.. నువ్వు వెళ్లి నిజం చెప్తే నేను చనిపోతానంటూ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇది నా సమస్య దీన్ని నేనే పరిష్కారించుకుంటాను. నువ్వు జోక్యం చేసుకోకని కావ్యతో అంటుంది స్వప్న. మరొక వైపు కనకం-కృష్ణమూర్తి కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇద్దరు కూతుళ్లు ఆ ఇంటికి కోడళ్ళుగా వెళ్లారని హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు అరుణ్ కి స్వప్న ఫోన్ చేసి నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం మా చెల్లికి ఎందుకు చెప్పావని అడుగుతుంది. ఫోన్ చేశాను లిఫ్ట్ చేసింది నువ్వే అనుకొని మాట్లాడానని అరుణ్ అంటాడు. ఇంకెప్పుడు అలా చెప్పకని స్వప్న తనతో అంటుంది.

మరొక వైపు రాహుల్ స్వప్నల శోభనం చెయ్యాలని ఇందిరాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి అనుకుంటారు. అక్కడే ఉన్న రుద్రాణి, నాకు ఇష్టం లేకుండా రాహుల్ పెళ్లి చేశారు.. ఏదైనా చేసుకోండని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ అక్కడికి రాగానే.. రాజ్, కావ్యలను ఇందిరాదేవి పక్కకు తీసుకొని వెళ్ళి. రాహుల్ స్వప్నల శోభనంకి కావలిసిన ఏర్పాట్లు చెయ్యమని చెప్తుంది. దానికి రాజ్ సరే అంటాడు. ఆ తర్వాత రాహుల్ స్వప్నల శోభనంకి గదిని డెకరేషన్ చేస్తూ స్వప్న చెప్పిన అబద్ధం గురించి ఆలోచిస్తుంది కావ్య. ఈ విషయం రాజ్ కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని కావ్య మనసులో అనుకుంటుంది. అప్పుడే రాజ్ కత్తి పట్టుకొని గదిలోకి వస్తాడు. కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.