Read more!

English | Telugu

ఫైమా ఎలిమినేట్ కావడంతో ఫస్ట్ టైమ్ ఏడ్చిన ఆదిరెడ్డి!

బిగ్ బాస్ హౌస్‌లో సండే వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ పక్కా కమర్షియల్‌గా ఉంటుంది. కాగా వినోదాన్ని పంచుతూ సస్పెన్స్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్. నాగార్జున వచ్చినప్పటి నుండి వినోదాన్నిచ్చే గేమ్స్ ఆడిస్తూ, మధ్య మధ్యలో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ లలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ ఉంటాడు. 

ఆ తర్వాత 'సమ్ మోర్ ఫన్ గేమ్స్' అంటూ డమ్ షల్ ఆర్ట్స్ ఆడించాడు నాగార్జున. బిగ్ బాస్ 'ఓ పిట్ట కథ' సినిమా పోస్టర్‌ని ఇనయా, శ్రీహాన్‌కి ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీసత్య 'దేశముదురు' మూవీ టైటిల్‌ని చెప్పలేకపోగా శ్రీహాన్‌కి ఆ టైటిల్‌ని ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఫైమా 'మిస్టర్ పర్ఫెక్ట్' టైటిల్ చెప్పగా, ఆ టైటిల్‌ని రోహిత్‌కి డెడికేట్ చేసాడు. ఆ తర్వాత ఆదిరెడ్డి, 'చంద్రముఖి' టైటిల్‌ని గెస్ చేయలేకపోగా, ఆ టైటిల్‌ని కీర్తి భట్‌కి డెడికేట్ చేసారు. 'క్రాక్' టైటిల్‌ని రేవంత్‌కి ఇవ్వగా, ఫైమాకి 'జాతి రత్నాలు' టైటిల్‌ని, శ్రీసత్యకి 'అందాల రాక్షసి' టైటిల్‌ని ఇచ్చాడు.

ఆ తర్వాత నామినేషన్స్‌లో చివరగా ఆదిరెడ్డి, ఫైమా ఉండగా ఫైమా ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత "హౌస్‌మేట్స్‌కి సెండ్ ఆఫ్ చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేయి ఫైమా" అని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. బయటకొచ్చే ముందు కీర్తితో "ఆదికి పొద్దున్నే ఆమ్లెట్ వేయి. సరేనా" అని చెప్పగానే ఆదిరెడ్డి ఏడ్చేసాడు. అయితే బాగా క్లోజ్‌గా ఉన్న గీతు వెళ్ళినప్పుడు కూడా ఏడ్వని ఆదిరెడ్డి.. ఇప్పుడు ఫైమా వెళ్లిపోతుంటే ఏడ్చాడా.. అని రేవంత్ కూడా ఆశ్చర్యపోయాడు. ఏదేమైనా ఈ వారం హౌస్ నుండి ఎలిమేట్ అయి బయటకొచ్చేసింది ఫైమా.