English | Telugu

బిగ్ బాస్ లో అడవి శేష్.. 'కోడి బుర్ర' ఎవరో కనిపెట్టాడా?

బిగ్ బాస్ హౌస్ లో సండే వచ్చిందంటే ఫన్ఫుల్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే.నాగార్జున వచ్చిఒక్కో కంటెస్టెంట్ వారం మొత్తం ఏం చేసారో? ఎవరు ఎలా ఉన్నారో? అని అడిగి తెలుసుకుంటాడు. అయితే ఇందులో ఒక్కోసారి గెస్ట్ లను తీసుకొస్తూ ఉంటాడు నాగార్జున.

హౌస్ మేట్స్ అందరికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. "మీలో ఒకరు మిర్రర్ పై ఒక పుర్రె బొమ్మని గీసి, 'కోడి బుర్ర' అని రాయాలి" అని చెప్పాడు నాగార్జున. రేవంత్ ఒక లిప్ స్టిక్ తో బొమ్మని గీసాడు. ఆ తర్వాత నాగార్జున ఇప్పుడు హౌస్ లోకి కూల్ కాప్ వస్తున్నాడని చెప్పాడు.

తన కొత్త సినిమా 'హిట్' తో మంచి హిట్ కొట్టిన 'అడవి శేష్' ని గెస్ట్ గా తీసుకొచ్చాడు నాగార్జున. అయితే అతను వచ్చాక నాగార్జున సరదాగా సాల్వ్ చేయమని ఒక కేస్ అప్పగించాడు. "బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిర్రర్ పై ఎవరో 'కోడి బుర్ర' అని రాసారు అది ఎవరో కనిపెట్టు?" అని చెప్పగా, శేష్ అది ఎవరు రాసారో అని సాల్వ్ చేసే పనిలో కంటెస్టెంట్స్ తో సరదగా కొన్ని గేమ్స్ ఆడించాడు. "ఆదిరెడ్డి గారు మీరే కదా ఆ బొమ్మ గీసింది" అని అనగా, "అది మీరు కనిపెట్టాలి" అని ఆదిరెడ్డి అనగా, "యూ ఆర్ రైట్ ఆది" అంటూ నాగార్జున నవ్వేసాడు. ఆ తర్వాత శ్రీహాన్ తన చేతిలోని లిప్ స్టిక్ ని పడేయగా, "ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే కచ్చితంగా నువ్వు కాదు శ్రీహాన్" అని శేష్ అన్నాడు. దీంతో హౌస్ లో నవ్వులు పూసాయి. రేవంత్ రాసింది అని కనిపెట్టాడు. ఆ తర్వాత గేమ్ ఆడిస్తూ వినోదాన్ని పంచాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.