English | Telugu

వర్ష బ్లౌజ్‌కు 70 ఎంఎం స్క్రీన్... ఇమ్మాన్యుయేల్ కామెంట్‌!

'జబర్దస్త్'లో లవ్ బర్డ్స్ అంటే ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గుర్తుకు వచ్చేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని, షో కోసం అలా చేస్తున్నారని చెప్పినవాళ్లు వున్నారు. ఏది ఏమైనా టీవీల్లో సుధీర్, రష్మీ హిట్ పెయిర్. ఇప్పుడు కొత్తగా ఇమ్మాన్యుయేల్, వర్ష పెయిర్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది.

ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య ట్రాక్స్ హిట్ అవుతున్నాయి. మొన్నటివరకు వాళ్ళిద్దరూ కెవ్వు కార్తీక్ టీమ్ లో చేశారు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ టీమ్ కు వచ్చారు. భాస్కర్ టీమ్‌కి వచ్చాక ఫస్ట్ స్కిట్‌లో లవర్స్‌గా కనిపించినా... చివరకు వర్షను భాస్కర్ పెళ్లి చేసుకున్నాడు. ఈ వీక్ టెలికాస్ట్ కానున్న స్కిట్‌లో వర్ష, ఇమ్మాన్యుయేల్ భార్యభర్తలుగా కనిపించనున్నారు.

భార్య ఎవరి కోసమో ముగ్గు వేస్తుందని అనుమానించే భర్తగా ఇమ్మాన్యుయేల్ కనిపించనున్నాడు. భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తే... 'పద్దతికి చీర కట్టిన దానిలా ఉంటాను. మీరు నన్నే అనుమానిస్తున్నావా?' అని వర్ష డైలాగ్ చెప్పింది.

'సూపర్ సూపర్.. మా ఆవిడ పద్ధతికి చీర కట్టినట్టు ఉంటుందంట! ఒక్కసారి ఇటు తిరుగమ్మా' అని వర్ష జాకెట్ బ్యాక్ సైడ్ కనిపించేలా ఆమెను తిప్పాడు. 'ఎవరైనా బ్లౌజులకు చిన్న చిన్న కిటికీలు పెట్టుకుంటారు. నువ్వు ఏంటి? 70 ఎంఎం తెర పెట్టావ్...' అని పంచ్ వేశాడు. ఏమీ చెప్పలేక వర్ష అలా నవ్వుతూ ఉండిపోయింది.

మొత్తానికి ఆడ‌వాళ్ల డ్ర‌స్సుల‌పై మ‌గాళ్ల కామెంట్లు టీవీ స్కిట్ల‌లోనూ కొన‌సాగుతూనే ఉన్నాయ్‌.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.