English | Telugu

'ఢీ' కొరియోగ్రాఫర్‌తో పూర్ణ స్టెప్స్... ప్రేమలో పడిందట!

స్టార్స్ అందరూ ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో కంటెస్టెంట్లు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు స్వతహాగా డాన్స్ నేపథ్యం వాళ్లు కావడంతో రీల్స్ విపరీతంగా చేస్తున్నారు. వాళ్లకు షోలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రియమణి, పూర్ణ నుండి మంచి కోపరేషన్ లభిస్తోంది.

రీసెంట్‌గా 'ఢీ'లో కొరియోగ్రాఫర్ అభితో కలిసి పూర్ణ ఓ పాటకు స్టెప్స్ వేశారు. దీనిని పూర్ణ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే కాదు... 'అభి, అయామ్ ఇన్ లవ్ విత్ దిస్' అని కామెంట్ చేశారు. అభి కొరియోగ్రఫీనీ మెచ్చుకున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్, పెర్ఫార్మర్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

దానికి అభి ఆనందంతో పొంగిపోయాడు. 'థాంక్యూ సోమచ్ మేడమ్..ఈ సాంగ్ మీకు ఇంత బాగా నచ్చిందని నేను అనుకోలేదు. నేను చాలా లక్కీ. నా స్టెప్స్ మీతో వేస్తున్నందుకు' అని పోస్ట్ చేశాడు.

బేసిక‌ల్‌గా మ‌ల‌యాళీ అయిన పూర్ణకు ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌, టీవీ ఇండ‌స్ట్రీ నుంచి మంచి స‌పోర్ట్ ల‌భిస్తోంది. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.