English | Telugu

డాక్ట‌ర్లే బ‌త‌క‌డ‌ని చెప్పేశారు.. టీమ్ లీడ‌ర్లే న‌న్ను బ‌తికించారు!

సూపర్‌హిట్ కామెడీ షో 'జబర్దస్త్'లో ఈమధ్య చాలా మార్పులు జరిగాయి. స్కిట్స్ చేసే టీమ్స్ సంఖ్య తగ్గింది. స్కిట్ నిడివి కూడా తగ్గించారు. అందులో భాగంగా కొంతమంది టీమ్ లీడర్లను తీసేశారు. దాంతో వాళ్ళు షోలో కనిపించడం లేదు. అలా 'జిగేల్' జీవన్ కూడా కొన్నాళ్ల నుంచి కనిపించడం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మళ్ళీ అతడు షోలో కనిపించనున్నాడు. అతడి ఆబ్సెన్స్ కి కారణం హెల్త్ ఇష్యూ అని ప్రోమోలో చూపించారు.

ఎప్పుడూ ప్రేక్షకులను నవ్వించే 'జబర్దస్త్' టీమ్ లీడర్లు స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా 'జిగేల్' జీవన్ కన్నీళ్లు అయితే ఆగలేదు. 'కొన్ని ఎపిసోడ్లు మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్స్ నుండి దూర‌మ‌య్యారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?' అని జీవన్ ను రష్మీ అడిగిన తర్వాత అతడు అసలు ఏమైందో వివరించాడు.

"నిజంగా నేను ఈ రోజు బతికి ఉన్నానంటే కారణం టీమ్ లీడర్లు. వీళ్ళందరూ లేకపోతే నిజంగా నేను బతికి ఉండేవాడిని కాదు. ఒక్కసారి కాదు... రెండుసార్లు సీరియస్ అయ్యింది. రెండోసారి అయితే డాక్టర్లు లేడ‌ని చెప్పేశారు. మా అమ్మ ఏడుపు. నా బాబు చిన్నోడు. ఇంజెక్షన్లకు కూడా బాడీ సహకరించలేదు. కష్టం అని డాక్టర్లు చెబితే... వీళ్ళందరూ నన్ను కాపాడారు" అని 'జిగేల్' జీవన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అతడితో పాటు తోటి 'జబర్దస్త్' టీమ్ లీడర్లు భావోద్వేగానికి లోనయ్యారు. 'మన జబర్దస్త్ లో ఎవరికి ఏం జరిగినా మన జబర్దస్త్ ఫామిలీ అంతా ఇలాగే ఉండాలి' అని గెటప్ శీను అన్నాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.