English | Telugu

స్వప్నపై దుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్.. కావ్య డిజైన్స్ చూసిన రాజ్ ఏం చేయనున్నాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -151 లో... కళ్యాణ్ గ్రౌండ్ కి వచ్చి అప్పు కి కాల్ చేస్తాడు. నేను రావడం లేదని చిరాగ్గా ఫోన్ కట్ చేస్తుంది అప్పు. అప్పు ఏదో ప్రాబ్లమ్ లో ఉందని ఎలాగైనా కళ్యాణ్ తెలుసుకోవాలనుకుంటాడు. మరొకవైపు శృతి డబ్బులు పంపిస్తే తన ఫ్యామిలీకి పంపించొచ్చని తను ఫోన్ చేస్తుందేమోనని కావ్య వెయిట్ చేస్తుంది. అప్పుడే శృతి ఫోన్ చేసి అకౌంటెంట్ రాలేదు వచ్చాక పంపిస్తానని కావ్యకి చెప్తుంది శృతి.

మరొకవైపు అప్పు టెన్షన్ గా తన ఫ్రెండ్ బండి మీద వెళ్తుంటే.. కళ్యాణ్ చూసి అసలు అప్పు ఎందుకు టెన్షన్ పడుతుందని తనని ఫాలో అవుతాడు. అప్పు తను పనిచేసే షాప్ ఓనర్ ని అప్పు అడుగుతుంది. ఆ షాప్ ఓనర్ లేవని చెప్పగానే అప్పు నిరాశ చెందుతుంది. అప్పుకి డబ్బులు కావాలని తెలుసుకున్న కళ్యాణ్ తనకి తెలియకుండా హెల్ప్ చెయ్యాలనుకుంటాడు. మరొకవైపు కావ్య వేసిన డిజైన్స్ ని సుభాష్, ప్రకాష్ లకు చూపిస్తాడు రాజ్. ఈ డిజైన్స్ ఒక ఫ్రీ లాన్సర్ వేసిందని రాజ్ చెప్తాడు. చాలా బాగున్నాయంటూ అందరు మెచ్చుకుంటారు. కావ్య వేసిన డిజైన్స్ అని ఎవరికి తెలియదు. మరొకవైపు అన్నపూర్ణ హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో కృష్ణమూర్తి బాధపడతాడు. కృష్ణమూర్తి అమ్మిన బొమ్మలు కూడా రిటర్న్ వచ్చేసరికి.. కృష్ణమూర్తి, కనకం ఇద్దరు బాధపడతారు. మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో అందరు కలిసి భోజనం చేస్తుండగా భోజనం మధ్యలో ఆపేసి స్వప్న లేస్తుంది. అన్నం వెస్ట్ చెయ్యొద్దని కావ్య అంటుంది. ఇంత అన్నం తింటే లావుగా బొద్దుగా తయారు అవుతానని స్వప్న అంటుంది. అప్పుడే ఉడికించిన వెజిటేబుల్స్ తీసుకొని రాహుల్ వస్తాడు. వాటిని చూసిన ఇందిరాదేవి గర్భవతి ఎవరైనా అలాంటివి తింటారా అని కోప్పడుతుంది. తనపై అందరు కోప్పడేసరికి కూర్చొని అన్నం తింటుంది స్వప్న.

మరొకవైపు నా వల్ల వీళ్ళకు ఎందుకు ఇబ్బందని అన్నపూర్ణ ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుంది. తనని చూసిన కనకం, కృష్ణమూర్తి ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. నా వల్ల మీకు ఇబ్బంది కలుగకూడదని వెళ్లిపోతున్నానని అన్నపూర్ణ అనగానే.. నేను నా సొంత అక్కలా చూసుకున్న నువ్వు ఎక్కడికి వెళ్ళానవసరం లేదని అన్నపూర్ణని వెళ్లకుండా ఆపుతుంది కనకం. మరొకవైపు రాజ్ డిజైన్స్ చూస్తు కావ్యకు చూపిస్తాడు. ఇవి డిజైన్స్ అంటే అని కావాలనే డిజైన్స్ వేసిన అమ్మయిని పొగుడుతాడు. కావ్య అక్కడ నుండి వెళ్ళిపోయాక చార్జర్ కోసం వెతుకుతుంటాడు రాజ్. కబోడ్ లో కావ్య వేసిన డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ ల్యాప్టాప్ లోవి ఉన్న డిజైన్స్ సేమ్ ఉండడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.