English | Telugu

అమ్మమ్మ కాబోతున్న సుమ..ఇద్దరు పిల్లలంటూ షాకిచ్చిన ఈషా!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "మాయ బజార్" మూవీ టీమ్ మోడల్ జెస్సి, ఈషా రెబ్బ, రవి వర్మ, గౌతమీ వచ్చారు. ఈ షోకి గౌతమీ చెప్పులు వేసుకోకుండా స్టేజి మీదకు వచ్చేసరికి "మీరెందుకు చెప్పులు వేసుకోలేదు" అని సుమ అడిగింది.."దేహమే దేవాలయం" కదా అందుకే వేసుకోలేదు అని చెప్పారు. చెప్పులు సరే మీ బంగారం లాంటివి ఏవీ పెట్టుకోరా అని మళ్ళీ అడిగేసరికి "నా మనసు బంగారం" అని మరో ఆన్సర్ చెప్పారు. "ఓహో దేహం దేవాలయం, మనసు బంగారం, మరి మెదడేమిటో అనేసరికి ఖాళీ స్థలం" అని తడుముకోకుండా టక్కున చెప్పేసారు. తర్వాత రవి వర్మకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి కొంతమంది స్టూడెంట్స్ పిలిచింది సుమ..కానీ వాళ్ళెవరూ నచ్చకపోయేసరికి పామ్పించేసింది... ఈ కాన్సెప్ట్ ఐపోయాక "అందెల రవళిది" అనే సాంగ్ కి గౌతమీ చేసిన క్లాసికల్ డాన్స్ కి అందరూ క్లాప్స్ కొట్టేశారు.

ఫైనల్ గా సుమ ఒక ఆవును తీసుకొచ్చి డాక్టర్ కి చూపించి "గడ్డి పెట్టిన తినడం లేదు, ఒంట్లో బాగుండడం లేదు"చూడండి అని చెప్పేసరికి "మీరు అమ్మమ్మ కాబోతున్నారు" అని డాక్టర్ చెప్పడంతో సుమ షాకైపోయింది..అంత షాక్లో కూడా "ఏమే చెప్పలేదేమిటే నీకు పుల్లగా ఏమన్నా తినాలనుందా" అని అడిగింది "వద్దు" అంటూ తల అడ్డంగా ఊపింది ఆ ఆవు..."తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడనిపిస్తుంది" అని ఈషాని అడిగేసరికి "తొందరపడ్డప్పుడు" అని చెప్పింది. దాంతో "ఈషా నీ ప్రేమ గురించి చెప్పు" అని సుమ రివర్స్ లో అడిగింది "యాక్ట్యువల్ గా నాకు ఇద్దరు పిల్లలున్నారు" అని చెప్పి షాకిచ్చింది.."వాళ్ళ నాన్న ఎక్కడుంటారు" అని సుమ అడగడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. ఇంతకు ఈషాకు పెళ్లయిందని పిల్లలు ఉన్నారని ఎవరికీ తెలీదు మరి రేపు రాబోయే షోలో ఎం చెప్పిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.