English | Telugu

Divya Elimination Twist : ఈ వారం దివ్య ఎలిమినేషన్‌.. ఆడియన్స్‌కు చిరాకు వచ్చింది!

బిగ్‌బాస్ సీజన్-9 మొత్తం తనూజ చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఆడినా ఓడినా ఏడ్చినా నవ్వినా అరిచినా చివరకి ఊపిరి పీల్చినా కూడా ఆమెని తప్ప మరొకరి ఫుటేజ్ ఇచ్చే సమస్యే లేదు అన్నట్లుగా షో నడుస్తుంది. అయితే చివరికి పవరాస్త్ర ఇమ్మానుయేల్ దగ్గరుంటే అది యూజ్ చేసేటప్పుడు కూడా మధ్యలో తనూజని హోస్ట్ నాగార్జున అడగటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మొత్తానికి అయితే ఈ వారం నో ఎలిమినేషన్ అయింది.

నిన్నటి ఎపిసోడ్ లో సండే ఫండేలో భాగంగా ఒక సెలెబ్రిటీ ఒక ఫ్యామిలీ మెంబర్ ని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఇక నామినేషన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేయగా దివ్య, సంజన మిగిలారు. వారిని గార్డెన్ ఏరియాకి పిలిచాడు నాగార్జున. సంజన, దివ్య ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నారు.. నీ దగ్గర పవరస్త్ర ఉంది.. దీనికి మూడు పవర్స్ అని బిగ్‌బాస్ నీకు చెప్పారు.. రెండు పవర్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.. ఇప్పుడు నీకు మూడో పవర్ ఏంటో చెప్తున్నాను.. ఈ పవరాస్త్ర ఉపయోగించి ఈ వారం నువ్వు ఎలిమినేషన్‌ని క్యాన్సిల్ చేసేయొచ్చు.. అయితే ఈ పవరస్త్రకి ఆ పవర్ కేవలం ఈ వారం మాత్రమే ఉంటుంది.. ఒకవేళ నువ్వు దీన్ని ఉపయోగించకపోతే పవరస్త్రకి ఇచ్చిన పవర్స్ అన్నీ అయిపోయినట్లే అంటూ నాగార్జున చెప్పాడు. ఈ పవరస్త్రకి ఉన్న మూడో పవర్ వాడతావా లేదా ఆడియన్స్ నిర్ణయమే ఫైనల్ అని వదిలేస్తావా.. డెసిషన్ నీది.. అరవై సెకన్ల టైమ్ ఇస్తున్నానంటూ నాగార్జున అడిగాడు.

కాసేపు ఆలోచించి చివరికి వాడుతున్నాను సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. పవర్ వాడుతున్నావ్ అంటే ఎలిమినేషన్‌ని క్యాన్సిల్ చేస్తున్నావని నాగార్జున మరోసారి అడిగాడు. అవును సర్ అంటే నాకు తెలుసు ఆడియన్స్ వారిద్దరిలో ఒకరు వెళ్లిపోవాలని నిర్ణయించారు.. కానీ పవర్ ఉపయోగించి వారికి ఇంకొక ఒన్ వీక్ ఛాన్స్ ఇస్తే వాళ్లని వాళ్లు ప్రూ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమోనని నా అభిప్రాయం అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అంటే ఇన్ని వారాలు వాళ్లు ప్రూ చేసుకోలేదా అంటూ నాగార్జున అడిగాడు. ప్రూ చేసుకున్నారు కాబట్టే టాప్-9 వరకూ వచ్చారు.. అని ఇమ్మూ చెప్పాడు. మరి ఇంకేం ప్రూ చేసుకోవడానికి వాళ్లకి ఇన్ని వారాల తర్వాత అవకాశం ఇస్తున్నావ్.. అంటూ నాగార్జున అడిగాడు. అంటే ఇది వాడినా వాడకపోయినా ఈ పవర్ అనేది పోతుంది సర్.. సో పవర్ ఉన్నప్పుడు వాడి ఒకరికి ఇమ్యూనిటీ ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం.. ఒకవేళ అప్పటికి వాళ్లు ఇంప్రూ చేసుకోకపోతే ఆడియన్స్ మళ్లీ వాళ్ల నిర్ణయం ఎలాగూ చెప్తారంటూ ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక పవరస్త్ర వాడటంతో ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది.

ఇమ్మాన్యుయల్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో సంజన, దివ్య మీరిద్దరూ సేఫ్ లివింగ్ రూమ్‌లోకి వచ్చేయండి అని నాగార్జున చెప్పాడు. నువ్వు వాడిన పవరస్త్ర వల్ల సంజన, దివ్య ఇద్దరు హౌస్‌లోకి వచ్చేశారు.. కానీ వీళ్లలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేటర్ అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా అని ఇమ్మాన్యుయల్, సంజన, దివ్యలని నాగార్జున అడుగగా.. ఎస్ అని అందరు అన్నారు. దాంతో దివ్య, సంజన ఇద్దరిని గార్డెన్ ఏరియాకి వెళ్ళమని ఎలిమినేషన్ రౌండ్ మొదలెట్టాడు నాగార్జున. ‌మీలో ఎవరి గన్ నుంచి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయో వాళ్లు ఎలిమినేటర్.. గ్రీన్ వచ్చినవాళ్లు సేఫ్ అని నాగార్జున చెప్పాడు. అయితే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సంజన సేఫ్ అయి దివ్య ఎలిమినేట్ అయింది. ఇమ్మాన్యుయల్ తన దగ్గరున్న పవరస్త్ర వాడడంతో ఈ వారం ఎలిమినేషన్ కి క్యాన్సిల్ అయి దివ్య సేవ్ అయింది. ఇక ఇద్దరిని హౌస్ లోకి రమ్మన్నాడు నాగార్జున.