English | Telugu

వండ‌ర్‌.. షణ్ముఖ్ జస్వంత్‌ నెల సంపాద‌న ఇంతా!

రెగ్యులర్ గా యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి షణ్ముఖ్ జస్వంత్ గురించి బాగా తెలుసు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ యూట్యూబ్ స్టార్.. ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా.. మినిమం పది మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. అతడి వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి. 'సాఫ్ట్‌వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ నుండి షణ్ముఖ్ క్రేజ్ బాగా పెరిగింది. అప్పటివరకు కామెడీ వెబ్ సిరీస్ లతో పాటు డాన్స్ వీడియోలు చేసుకునే షణ్ముఖ్ ని ఈ వెబ్ సిరీస్ స్టార్ ని చేసింది. షణ్ముఖ్ యూట్యూబ్ ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్స్ 3 మిలియన్స్‌కు పెరిగిపోయారు.

ఇప్పుడు 'సూర్య' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు షణ్ముఖ్. దీనికి కూడా మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ ను విడుదల చేశారు. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రీసెంట్ గా షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. అంతేకాదు.. యాక్సిడెంట్ కూడా చేశాడు. అయితే ఇవేవీ కూడా అతడి కెరీర్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. ఎప్పటిలానే తన వీడియోలతో బిజీ అయిపోయాడు ఈ నటుడు.

ఇదిలా ఉండగా.. షణ్ముఖ్ ఆదాయం ఎంత ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈయన ఛానెల్‌కు 3.3 మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు 28 కోట్ల వ్యూస్ ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. షణ్ముఖ్ ఆదాయం నెలకు రూ.7 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. షణ్ముఖ్ వెబ్ సిరీస్ కు ఎపిసోడ్ ప్రకారం రెమ్యునరేషన్ తీసుకుంటాడట. ఈ లెక్క చూస్తే.. షణ్ముఖ్ నెలకు పది లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. నిజంగా ఇది వండ‌రే!