English | Telugu
ఢీ-15 టీజర్ రిలీజ్...ప్రోమోలో మెరిసిన ప్రభుదేవా!
Updated : Dec 7, 2022
ఢీ-14 సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు సీజన్ - 15 స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన ఆడిషన్స్ కూడా ఆగష్టు నుంచి నిర్వహించి టాలెంటెడ్ కంటెస్టెంట్స్ ని ఫిల్టర్ చేసినట్టుగా సోషల్ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఈ సీజన్ 15 కి సంబంధించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కనిపించి అలరించారు. ఈ సీజన్ ని ప్రభుదేవా లాంఛ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఢీ - 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ని ఈ నెల 11 వ తేదీ ఆదివారం రాత్రి 7 ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోలో 12 మంది కంటెస్టెంట్స్ ని రెడీ చేశారని అలాగే వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సీజన్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. సండే ఢీ 14 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ చేశారు.
ఇప్పుడు సీజన్ 15 ని కూడా సండే రోజునే గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఐతే ఎపిసోడ్స్ అనేవి ఇదివరకు బుధవారం పూట ప్రసారమైనట్టు అవుతుందా లేదా వాటి టైమింగ్స్ ని ఏమన్నా చేంజ్ చేస్తారా ? వంటి ఎన్నో విషయాలు తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.