English | Telugu
కంటెస్టెంట్స్ టాస్క్ లతో బిజీ.. బిగ్ బాస్ సరికొత్త గేమ్ ప్లాన్!
Updated : Dec 7, 2022
బిగ్ బాస్ ప్రతీరోజు సరికొత్త టాస్క్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే విన్నర్ కోసం జరిగే రేస్ లో కంటెస్టెంట్స్ అంతా తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. నిన్న జరిగిన టాస్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కన్ఫెషన్ రూంకి పిలిచి, "ఎవరు గెలుస్తారో చెప్పి, మీ ఓట్ ని తెలియజేయండి" అని అన్నాడు. అయితే మొదట ఈ టాస్క్ లో ఇనయా, రేవంత్ పాల్గొన్నారు. వీరిద్దరిలో ఇనయా ఓడిపోతుందని కీర్తిభట్ చెప్పగా, రేవంత్ ఓడిపోతాడని శ్రీసత్య, ఇనయా ఓడిపోతుందని శ్రీహాన్ ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఓట్ వేసారు.
"మీకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ 'పిరమిడ్ పడొద్దు'. ఈ టాస్క్ లో పేపర్ కప్స్ తో పిరమిడ్ ని చేసి, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కేటాయించిన పెడస్టియల్ మీద పెట్టాలి. అలా మొదట గేమ్ పూర్తి చేసినవాళ్ళే.. ఈ టాస్క్ విజేత" అని బిగ్ బాస్ చెప్పాడు. అయితే చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టాస్క్ లో రేవంత్ విజయం సాధించాడు. టోటల్ అయిదుగురు ఓట్లు వేయగా, రేవంత్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ టాస్క్ గెలిచినహౌస్ మేట్స్ ఒక లక్ష పదివేల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ 'మనీ ట్రాన్స్‌ఫర్' టాస్క్ ఇచ్చాడు. ఇందులో శ్రీసత్య, శ్రీహాన్ ఒక జట్టుగా.. ఆదిరెడ్డి, కీర్తి భట్ ఒక జట్టుగా ఉన్నారు. కాగా ఈ టాస్క్ లో శ్రీహాన్, శ్రీసత్య కలిసి బాగా ఆడి, గెలిచారు.
ఆ తర్వాతి టాస్క్ 'పవర్ పంచ్', "పవర్ పంచ్ చేసి బ్యాగ్ లో ఉన్న ఇసుకని వారికిచ్చిన కంటైనర్ లో నింపాలి" అని బిగ్ బాస్ చెప్పాడు. ఇనయా, రేవంత్ టాస్క్ లో పాల్గొనగా కీర్తి భట్ సంచాలకులురాలిగా ఉంది. అయితే ఒక్కో కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూంకి పిలిచి "ఎవరు గెలుస్తారు" అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో అందరూ రేవంత్ గెలుస్తాడని తమ ఓట్ ని తెలియజేసారు. అయితే ఈ టాస్క్ లో రేవంత్ గెలిచి, ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.