English | Telugu
ఢీ-15 డాన్సింగ్ షో లోకి సుడిగాలి సుధీర్ రీ-ఎంట్రీ ?!
Updated : Dec 7, 2022
ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ డ్యాన్సింగ్ షో ఇప్పటి వరకు విజయవంతంగా 14 సీజన్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇప్పుడు సీజన్ 15 మొదలవబోతోంది. ప్రతి బుధవారం రాత్రి 9 . 30 అయితే చాలు ఆడియన్స్ టీవీకి అతుక్కుపోయేవారు..ఇటీవలే సీజన్ 14 గ్రాండ్ ఫినాలే జరిగింది. దీనికి మాస్ మహారాజ రవితేజ ముఖ్య అతిధిగా వచ్చారు..ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ గా జతిన్ నిలిచాడు..
ఇక అతి త్వరలోనే 15 సీజన్ ఘనంగా ప్రారంభం కాబోతుంది అని హోస్ట్ ప్రదీప్ అనౌన్స్ చేసాడు. ఐతే రాబోయే సీజన్ లో టీంలీడర్ గా సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది .. సుధీర్ గతంలో నాలుగు సీజన్స్ కి టీంలీడర్ గా ఉన్నాడు..డాన్స్ పెర్ఫార్మెన్సెస్ మధ్యలో ఆయన చేసే చిన్న చిన్న కామెడీ స్కిట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండేది .. కానీ గత టు సీజన్స్ నుంచి సుధీర్ కనిపించలేదు. వేరే షోస్ చేస్తుండడం వలన ఇక్కడ ఆది ఆ ప్లేస్ ని రీ-ప్లేస్ చేసాడు.
ఐతే ఆడియన్స్ మాత్రం సుధీర్ ని మిస్ అవుతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండేసరికి ఇప్పుడు స్టార్ట్ కాబోయే ఢీ-15 షోకి సుధీర్ వస్తున్నట్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. దీంతో సుధీర్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఐతే సుధీర్ నిజంగానే ఈ షోలో కనిపించబోతున్నాడా ? ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు కనిపిస్తారు ? అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.