English | Telugu
Demon Pavan Worst Behaviour: రీతూపై కళ్యాణ్ ఫైర్.. పీక పట్టుకున్న డీమాన్ పవన్!
Updated : Nov 25, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ల ప్రక్రియ యమ జోరుగా సాగింది. ఎవరూ ఊహించని విధంగా డీమాన్ పవన్ , పవన్ కళ్యాణ్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఈ వారం రీతూ కెప్టెన్ అయింది. అయితే తను కెప్టెన్ అవ్వడం వెనుక డీమాన్ పవన్ సాక్రిఫైజ్ ఉందని అందరికి తెలుసు. అయితే దాని గురించి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రీతూ, డీమాన్ పవన్ మధ్య మాటల యుద్ధం సాగింది.
నిన్నటి నామినేషన్లో ఇమ్మాన్యుయల్ ని డీమాన్ పవన్ నామినేట్ చేశాడు. అసలు మిమ్మల్ని నామినేట్ చేయడం నాకు ఇష్టం లేదన్నా.. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం.. మీరు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది. అయినా నాకు పాయింట్లు ఉన్నాయి కాబట్టి నామినేట్ చేస్తున్నానంటూ ఇమ్మాన్యుయల్ ని నామినేట్ చేశాడు డీమాన్ పవన్. కెప్టెన్సీ టాస్క్ ముందు మీరు నాకు సపోర్ట్ చేస్తానని మాటిచ్చారు కానీ టాస్క్ లో మాట తప్పారు అని ఇమ్మాన్యుయల్ తో అన్నాడు. నేను నీకు సపోర్ట్ చేద్దామంటే అక్కడ బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్ ఆట సాగుతోంది.. నేను నీకు ఎలా సపోర్ట్ చేయగలను డీమాన్ .. అప్పటికి నేను కళ్యాణ్ తో అన్నాను.. డీమాన్ కి సపోర్ట్ చేద్దామని కానీ అతను వినలేదని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. మీరు అలా మాట తప్పడం నాకు నచ్చలేదని నామినేట్ చేసానని డీమాన్ అన్నాడు. మరి నువ్వు గివప్ ఎందుకిచ్చావంటూ కళ్యాణ్ మధ్యలో ఎంటర్ అయ్యాడు. సుమన్ అన్న, రీతూ, నువ్వు ముగ్గురే మిగిలారు కానీ నువ్వు గివప్ ఇచ్చేసి రీతూకి సపోర్ట్ చేశావని డీమాన్ తో కళ్యాణ్ అన్నాడు. దాంతో రీతూ మధ్యలోకి వచ్చి.. నీ గేమ్ నువ్వు ఆడావ్.. అతని గేమ్ అతను ఆడాడని అరిచేసింది. దాంతో కళ్యాణ్ ఇక చెలరేగిపోయాడు.
నేను చెప్పేది అదే రీతూ.. వాడు వాడి గేమ్ ఆడట్లేదు.. నీకోసం ఆడాడు.. నీ కోసం వాడి కెప్టెన్సీని వదులుకున్నాడు అర్థమవుతుందా అంటూ రీతూపై కళ్యాణ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. నేను డీమాన్ తో మాట్లాడుతున్నాను.. మా మధ్యలో నువ్వు వస్తే నేను వస్తానంటు రీతూ మీదకి కళ్యాణ్ వెళ్తుంటే డీమాన్ ఆపుతాడు. అయితే ఎంత చెప్పినా వినకపోయేసరికి కళ్యాణ్ పీక పట్టుకుంటాడు. పక్కనే ఉన్న ఇమ్మాన్యుయల్ అది గమనించి.. వెంటనే డీమాన్ ని వదలు అని పక్కకి లాక్కెళతాడు. ఆయితే కళ్యాణ్ ని ఆపడానికే డీమాన్ పీక పట్టుకున్నాడు. కానీ అక్కడ వేరేలా పోట్రే అయింది. ఇక ఆ తర్వాత రీతూ వాగుతూనే ఉండటంతో కళ్యాణ్ తన కుర్చీని తన్నేసి వెళ్ళిపోయాడు. అయితే కళ్యాణ్ ఇంత అగ్రెసివ్ అవ్వడం ఇది రెండోసారి. గత వారం సుమన్ శెట్టిపై సీరియస్ అయిన కళ్యాణ్.. ఈ సారి రీతూపై ఇష్టమొచ్చినట్టు మాటలు అనేశాడు. ఇది చూసిన ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. వీకెండ్ లో నాగార్జున వచ్చి కళ్యాణ్ కి రెడ్ కార్డ్ ఇస్తాడని తాట తీస్తాడని ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే డీమాన్ పవన్, కళ్యాణ్ , రీతూల మధ్య జరిగిన ఈ హీటెడ్ ఆర్గుమెంట్స్ లో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు కామెంట్ చేయండి.