English | Telugu
షన్నుకి దీప్తి షాక్.. వైరల్ అవుతున్న పోస్ట్
Updated : Dec 23, 2021
యూట్యూబ్ క్రేజీ లవర్స్ షన్ను, దీప్తి విడిపోతున్నారా? .. ఇద్దరి మధ్య బిగ్‌బాస్ సీజన్ 5 మంట పెట్టిందా? దీనికి ప్రధాన కారణం సిరి హన్మంతేనా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీప్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏం చెబుతోంది? .. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబర్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ గత కొంత కాలంగా డేటింగ్ లో వున్న విషయం తెలిసిందే.
ఇద్దరం ప్రేమలో వున్నామన్న విషయాన్నిఇప్పటికే బయటపెట్టేశారు కూడా. అంతే కాకుండా షన్నుని గెలిపించడం కోసం సునైనా భారీగానే క్యాంపెయిన్‌ని రన్ చేసింది. హౌస్ బయట షన్ను కోసం సునైన చేయని హంగామా లేదు. కానీ షన్ను మాత్రం సిరితో హౌస్ లో హగ్గులతో గబ్బు లేపాడు. టైటిల్ విజేతగా నిలవాల్సిన షన్ను.. సిరి మాయలో పడి రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది.
Also read:దీప్తి హింట్ ఇచ్చిన వీడియో వైరల్!
వీరిద్దరి వ్యవహారం శృతిమించిందని సిరి తల్లి ఓపెన్ గానే చెప్పినా.. దీప్తీ వెనకబడుతున్నావని హింట్ ఇచ్చినా షన్ను పట్టించుకోలేదు. మళ్లీ సిరితో పదే పదే హగ్గుల కోసం వెంర్లాడాడు. ఇదే దీప్తికి ఆగ్రహాన్ని తెప్పించిందని చెబుతున్నారు. ఆ కారణంగానే షన్నుకు దూరం కావాలని దీప్తి భావించి అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:నాగ్ జోడీగా `లెజెండ్` బ్యూటీ!
ఇన్ స్టా వేదికగా దీప్తి పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. `కనీసం నీ మనస్సాక్షితో అయినా నిజాయితీగా వుండు. నా చుట్టూ వున్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఈ సంవత్సరం నాకేమీ బాగా అనిపించలేదు` అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ని బట్టి షన్ను - సిరిల వ్యవహారం దీప్తిని బాగా హర్ట్ చేసిందని అందుకే షన్నుకి దీప్తి బ్రేకప్ చెబుతోందని నెట్టింట ప్రచారం ఊపందుకుంది.