English | Telugu
మళ్ళీ కలుద్దాం అంటూ ముగిసిన కార్తీక దీపం!
Updated : Jan 24, 2023
ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న 'కార్తీక దీపం' సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ తో ముగిసింది. అయితే గత కొద్దిరోజులుగా క్లైమాక్స్ ఎలా ఉండాబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈ ఎపిసోడ్ లో... మోనిత దగ్గర ఉన్న గన్ ని దీప తీసుకోగానే సీన్ రివర్స్ అయ్యింది. పిల్లలని తీసుకొని వెళ్ళండి అత్తయ్య అని దీప అనగానే సౌందర్య పిల్లలను తీసుకొని వెళ్తుంది. "నన్ను వదిలిపెట్టు... దూరం నుండి అయినా సరే కార్తీక్ ను చూస్తూ బ్రతికేస్తా ప్లీజ్ దీప వదిలిపెట్టు" అని బ్రతిమిలాడుతుంది. అప్పటికే దీప చేతిలో ఉన్న గన్ గురి తప్పి పేలుతుంది. అందులో నుండి బుల్లెట్ నేరుగా మోనిత గుండెల్లోకి దూరి.. తను అక్కడికక్కడే పడిపోతుంది. ఆ తర్వాత దీపని తీసుకొని కార్ లో వెళ్తుండగా... మోనిత ఒక్కసారిగా లేచి వచ్చి వాళ్ళు వెళ్తున్న కార్ లో బాంబ్ పెడుతుంది. నాకు దక్కని కార్తీక్ ఎవరికి దక్కకూడదంటూ మోనిత చనిపోతుంది.
మరో వైపు హిమతో గొడవపడి శౌర్య వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతుంది. కార్తిక్, దీపలు కార్ లో వెళ్తుంటారు. నీకేం కాదు దీప... నేను నీకు ఏం కానివ్వను అని కార్తిక్ అనగానే నా పిల్లల్ని చూడకుండానే వెళ్ళిపోతానా... పిల్లల్ని జాగ్రత్త గా చూసుకోండి డాక్టర్ బాబు అంటుంది. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దీప" అని కార్తిక్ అంటాడు. కార్ ఆపమని దీప చెప్తుంది. కార్తిక్ కార్ ఆపి పక్కకి నడుచుకుంటూ వస్తారు. "మీతో మళ్ళీ ఏడు అడుగులు వెయ్యాలని ఉంది. నా చివరి కోరికలు తీర్చరా" దీప అనగానే ఇద్దరూ ఏడు అడుగులు వేసి నడుస్తారు. అంతలోనే మోనిత కార్ లో పెట్టిన బాంబు పేలిపోతుంది. అది చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నడుచుకుంటూ ముందుకెళ్తారు.
ఒక దగ్గర కూర్చొని ఇద్దరూ ఒకరికొకరు వారి పరిచయం దగ్గర మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన అన్ని జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. వీరి ఇద్దరి మధ్య జరిగిన ఈ సీన్స్ ఎమోషనల్ గా సాగాయి. మొదటి నుంచి వారు పడిన బాధల గురించి చెప్పుకుంటూ ఉండగా.. "ఇక నేను బ్రతకను డాక్టర్ బాబు" అని దీప అంటుంది. "నేను నిన్ను ఎలాగైనా బ్రతికించుకుంటాను" అని కార్తిక్ అంటాడు. అలా ఇద్దరూ కలిసి ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. ఇలా 'కార్తీక దీపం' ముగిసింది.
'ది ఎండ్' అని ఎండ్ టైటిల్స్ వేయకుండా 'మళ్ళీ కలుద్దాం' అని వేసాడు డైరెక్టర్. దీంతో పార్ట్-2 ఉంటుందేమోనని అనుకుంటున్నారు కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్.