English | Telugu

వసుధార చేసిన మోసంతో తనకి ఒంటరితనం అలవాటయ్యిందన్న రిషి!

'గుప్పెడంత మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ -667లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో... జగతి, మహేంద్రలు కాలేజీకి వచ్చి రిషి, వసుధారల గురించి మాట్లాడుకుంటారు.

"రిషీ సర్ ఒంటరిగా ఉన్నారేంటి ఇంకా ఇంటికెళ్ళలేదా" అని వసుధార అడుగుతుంది. "చిన్నప్పుడే ఒకరు ఒంటరి చేసారు. సాక్షి కొద్దీ రోజులకి తోడుంటా అని చెప్పి తన దారి తను చూసుకుంది. నువ్వేమో నన్ను నాకే పరిచయం చేసి నన్నిలా ఒంటరిని చేసావు. ఒంటరిగా ఉండడం నాకు అలవాటు అయిపోయింది. ఒంటరితనం అనేది శాపంగా మారిన వరం" అని అంటాడు.. మనం మాట్లాడుకోవాలి సర్ అని వసుధార అనగానే మనం అనే పదం ఇక వాడకని చెప్తాడు. ఆ తర్వాత వసుధార బాధపడుతూ వెళ్లిపోతుంటే... తనకి ఎదురుగా దేవయని వస్తుంది. ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. వసుధార మాస్ డైలాగ్స్ తో దేవయానికి చెమటలు పట్టించింది.

ఆ తర్వాత వసుధార వెళ్లే దారిలో రాజీవ్ వస్తాడు. కాసేపు తనకి మాటలతో చిరాకు తెప్పిస్తాడు. దాంతో వసుధారకి చిరాకు వచ్చి వెళ్లిపోతుంది. వసుధార ఒక ప్రాజెక్ట్ గురించి రిషికి మెసేజ్ చేస్తుంది. తను రిప్లై ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.