English | Telugu

కోపంతో అత్తింటి నుండి పుట్టింటికి వెళ్ళిన ముకుంద!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ -61లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో... ముకుంద తనకి జరిగిన సంఘటనని అవమానంగా భావించి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి తనకి పుట్టింటికి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఇంట్లో అందరూ ముకుంద కన్పించడం లేదని కంగారుపడుతుంటారు. ఇంతలో భవానికి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది ముకుంద. " నా భర్త ఆదర్శ్ నన్ను వదిలేసి వెళ్లినప్పటి నుండి మీరందరు నా వాళ్ళు అనుకొని... మా అమ్మనాన్నలు రమ్మని పిలిచినా వెళ్లకుండా నా కుటుంబంతోనే ఉంటానని చెప్పి పంపించేసాను. ఇప్పుడు మీరు కుటుంబంలో ఒక కోడలు గా కూడా నన్ను భావించట్లేదు.. ఇంకో కోడలు వచ్చాక నా గురించి పట్టించుకోవడం మానేసారు.. అందుకే మా పుట్టింటికి వెళ్తున్నాను... ఎవరికీ చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించండి పెద్ద అత్తయ్యా" అంటూ చేసిన వాయిస్ మెసేజ్ ని ఇంట్లో వాళ్ళు అందరూ వింటారు.

ముకుంద వెళ్తూ వెళ్తూ ఇంట్లో వారిపై ఈ ఆరోపణలు ఏంటని భవానిని అడుగుతుంది రేవతి. నువ్వు అయ్యినా నగలు తీసుకుంటున్నానని ముకుందని ఒక్క మాట అడిగితే తను ఇంత బాధపడి ఉండేది కాదు. ఆదర్శ్ ఇంట్లో లేడు కదా తనని మనం ఎంత బాగా చూసుకోవాలంటూ భవాని ఇంట్లో వారిపై కోప్పడుతుంది. నా వల్లే వెళ్ళింది కాబట్టి నేనే వెళ్లి ముకుందని తీసుకొస్తానంటు రేవతి వెళ్తుంది.

రేవతి వస్తున్న విషయాన్ని ముకుందకి ముందుగానే కాల్ చేసి చెప్తుంది అలేఖ్య. రేవతి వెళ్ళి ముకుందని ఇంటికి రమ్మని అడిగితే... రానంటూ సూటిగా చెప్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే...!

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.