English | Telugu

డాన్స‌ర్ కేవల్ మృతి... విషాదంలో 'ఢీ' ఫ్యామిలీ

యువ డాన్సర్ కేవల్ తమంగ్ మృతి చెందాడు. తెలుగు డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో పాటు హిందీ డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ప్లస్'లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కేవల్ కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో పోరాడుతున్నాడు. అతడిని కాపాడటం కోసం కొరియోగ్రాఫర్ యశ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సహాయం చేయమని ప్రముఖులను, ప్రేక్షకులను కోరాడు. ప్రియమణి, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, మేఘన తదితరులు ముందుకొచ్చారు. విధిరాత ముందు వీరి ప్రయత్నం తల వంచక తప్పలేదు.

కేవల్ తమంగ్ ఆదివారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతడి మరణవార్తను ధృవీకరిస్తూ యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నువ్వు లేవనే విషయాన్ని మనసుకు తీసుకోలేకపోతున్నాను. నేను ఇది భరించలేకపోతున్నాను. స్వర్గంలో విశ్రాంతి తీసుకో బ్రదర్. నన్నెప్పటికీ, జీవితాంతం ఈ వేదన వెంటాడుతుంది. నేనింకా నువ్వున్నట్టు ఫీలవుతున్నా. చాలా త్వరగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయావ్" అని యశ్ పోస్ట్ చేశాడు. కేవల్ మృతిపై పలువురు టీవీ ప్రముఖులు, డాన్సర్లు సంతాపం వ్యక్తం చేశారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.