English | Telugu

బిగ్ ‌బాస్ సీజ‌న్ 5 హోస్ట్ మారుతున్నారా?

బిగ్ బాస్ సీజ‌న్ 4 కోవిడ్ కార‌ణంగా ఆల‌స్యం కావ‌డంతో సీజ‌న్ 5ని ముందుగానే స్టార్ట్ చేయాల‌ని స్టార్ మా చాన‌ల్‌ నిర్వాహ‌కులు అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశారు. సీజ‌న్ 4 కోవిడ్ తీవ్ర‌త కొంత త‌గ్గిన త‌రువాత ప్రారంభించినా వీక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. దీంతో సీజ‌న్ 5ని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే సీజ‌న్ 5లో పాల్గొనే కంటెస్టెంట్‌ల‌కు సంబంధించిన ఓ లిస్ట్‌ని సిద్ధం చేశార‌ట‌. 60 మందిని ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశార‌ట‌. అందులోంచి షోలో పాల్గొనే ఫైన‌ల్ కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేయ‌నున్నార‌ట‌. ఏప్రిల్ చివ‌రి వారంలో ఈ షోని ప్రారంభించే అవ‌కాశాలు వున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్న‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ని మేక‌ర్స్ ప్రారంభించార‌ని, బిగ్‌బాస్ హౌస్ సెట్‌కి సంబంధించిన ప‌నులు కూడా చురుగ్గా జ‌రుగుతున్నాయ‌నీ తెలిసింది.

ఇదిలా వుంటే ఈ సీజ‌న్‌ని హోస్ట్ చేయ‌బోయేది ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. నాగార్జున 'బంగార్రాజు'తో పాటు ప్ర‌వీణ్ స‌త్తారు చిత్రంతో బిజీ కాబోతున్నారు. దీంతో హోస్ట్ మారే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు. ఈ సీజ‌న్ 5కి హోస్ట్‌గా నాని వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వుంద‌ని తాజా టాక్‌. అయితే నాని కూడా వ‌రుస‌గా మూడు చిత్రాల్లో న‌టిస్తూ బిజీ షెడ్యూల్‌తో వున్నారు. మ‌రి ఎవ‌రు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తారో.. వెయిట్ అండ్ సీ.