English | Telugu
సుమ, అనసూయ బాతు స్టెప్పులు!
Updated : Sep 27, 2022
అనసూయ, సుమ.. బుల్లితెర మీద ఇద్దరూ ఇద్దరే. సుమ సీనియర్ మోస్ట్ యాంకర్ ఐతే, అనసూయ ఆమెకు జూనియర్. కానీ ఈ ఇద్దరు యాంకర్లు ఒక్క చోట కలిసి పోటాపోటీగా ఏది చేసినా ఆ స్టైలే వేరుగా ఉంటుంది. అనసూయ అందమైన యాంకర్ , సుమ మాటలతో మాయ చేసే యాంకర్. వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ లో "క్రేజీ కిచెన్" పేరుతో స్పెషల్ వంటకాలు చేసి ఆడియన్స్ కి నోరూరిస్తూ ఆ రెసిపీస్ చెప్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.
రీసెంట్ గా అలాంటి ఒక వీడియోను వారు చేశారు. 'క్రేజీ కిచెన్' పేరుతో వీళ్ళిద్దరూ చేసినకామెడీ డాన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాన్స్ రీల్ ని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వాళ్లిద్దరూ బాతుల్లా స్టెప్పులేసి మరీ ఎంటర్టైన్ చేశారు. ఈ క్రేజీ కిచెన్ ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ పోస్ట్ చేసింది సుమ. కానీ మధ్యలో కొంత కాలం దీన్ని రన్ చేయడం ఆపేసారు.
ఇప్పుడు గ్లామరస్ యాంకర్ అనసూయతో తను చేసిన రెసిపీతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు సుమ. ఇక నెటిజన్స్ మాత్రం ఇక్కడ కూడా ఆంటీ మాటను వదిలిపెట్టినట్టు లేరు. "ఆంటీతో డాన్స్ చేస్తున్నావెందుకు.. ఇద్దరు ఆంటీలు బాగా చేస్తున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.