English | Telugu
నేనెవరినీ 'ఆంటీ' అని పిలవను!
Updated : Sep 27, 2022
యాక్టర్ గీత అంటే తెలియని వారు లేరు. ఈమె హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 40 ఏళ్ళ నట ప్రస్థానంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు 'ఆలీతో సరదాగా' షోకి వచ్చి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. "ఎందుకండీ ఇప్పుడు పెద్దవాళ్ళను ఆంటీ అంటే కోపం వస్తోంది" అని నటి గీతని అడిగాడు అలీ.
"ఏజ్ చూసుకుని పిలవాలి" అంటూతన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పింది గీత. అందుకే తాను అప్పటినుంచి ఎవరినీ "ఆంటీ" అని పిలవను అని చెప్పింది. ఒక మలయాళం మూవీ షూటింగ్ టైంలో గీత వయసు 25 ఉన్నప్పుడుఅక్కడ ఒక పెద్దావిడ అంటే 50 ఏళ్ళ ఆవిడ ఉండేసరికి ఆమెను "హలో ఆంటీ ఎలా ఉన్నారు" అని అడిగిందట గీత.
ఆంటీ అన్న మాటకుఆమె సీరియస్ ఐపోయి "ప్లీజ్ డోంట్ కాల్ మీ ఆంటీ" అని చెప్పేసరికి అప్పటినుంచి తాను ఆంటీ అని పిలవడం మానేసినట్లు చెప్పింది. షూటింగ్ రెండో రోజు ఉదయం ఆ పెద్దావిడ కనిపించేసరికి "గుడ్ మార్నింగ్" అని ఆమె పేరు పెట్టి పిలిచేసరికి ఆవిడ చాలా హాపీ గా ఫీల్ అయ్యారని చెప్పింది గీత.
అలాగే తనకు డాన్స్ చేయడం రాదు కాబట్టే తాను టాప్ హీరోయిన్ ని కాలేకపోయానని చెప్పింది. "నేను నటించే టైములో శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక.. అందరికీ డాన్స్ వచ్చు కాబట్టే టాప్ యాక్టర్స్ అయ్యారు. నాకు డాన్స్ వచ్చి ఉంటే వీళ్లందరినీ బీటౌట్ చేసేసేదాన్ని" అని చెప్పింది గీత.