English | Telugu
రౌడీవేర్ నుంచి ఎలాంటి ఫాషన్ వేర్ ఐనా తీసుకో!
Updated : Sep 16, 2022
ఆహా వేదికగా ఫస్ట్ టైం డాన్స్ ఐకాన్ ప్రోగ్రాంని లాంచ్ చేశారు. ఈ డాన్స్ షోలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చి ఆనంద్ అనే కుర్రాడికి భరోసా ఇచ్చి తన మంచితనం చాటుకున్నాడు. డాన్స్ కంటెస్టెంట్స్ లో ఒక కంటెస్టెంట్ బాధలు విని కరిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక స్లమ్ ఏరియా నుంచి ఆనంద్ అనే కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో డాన్స్ ఐకాన్ స్టేజి పై డాన్స్ చేసి అందరిని ఫిదా చేసేసాడు.
ఇక తన గురించి హోస్ట్ చెబుతూ ఆనంద్ కు అమ్మ అంటే ఎంతో ఇష్టం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేక ఇలా మామూలు బట్టలతో ఈ స్టేజి మీదకు వచ్చి టాలెంట్ నిరూపించాడు అని చెప్పారు. ఆ మాటలకు విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. అతని డాన్స్ ను మెచ్చుకుంటూనే.. గతంలో తాను అనుభవించిన కష్టాల గురించి గుర్తు చేసుకున్నాడు.
తన ఫస్ట్ మూవీ "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమా చేస్తున్న టైములో ప్రొమోషన్స్ కోసం వెళ్ళడానికి తన దగ్గర కూడా సరైన బట్టలు లేవని ఆ మూవీ ప్రొడ్యూసర్ ని అడిగి కాస్ట్యూమ్ వేసుకొని ప్రమోషన్ కి వెళ్ళానని తెలిపారు. అంతే కాదు కాస్ట్యూమ్ లేవని బాధపడకు అని చెప్తూనే తను రన్ చేస్తున్న రౌడీ వేర్ నుంచి తనకు కావాల్సినన్ని ఫ్యాషన్ వేర్స్ పంపుతానన నచ్చిన స్టైల్ వేసుకుని డాన్స్ పెర్ఫామెన్స్ చేయమని విజయ్ దేవరకొండ ఆనంద్ కు హామీ ఇచ్చేసాడు. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి మూవీ చేస్తున్నాడు విజయ్.