English | Telugu

కంటెస్టెంట్స్ తో పాటూ ప్రేక్షకులలో  స్పూర్తిని నింపిన ఆదిరెడ్డి స్పీచ్!

పదకొండో రోజు బిగ్ బాస్ హౌస్ లో 'నిన్న జరిగిన సిసింద్రీ టాస్క్ లో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకని ఒక్కొక్కరుగా వచ్చి మీ జీవితంలో బేబి ఉన్నారా ? ఉంటే వారితో ఎలా ఉండేది మీ అనుబంధం వివరించండి అని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్పాడు. కెప్టెన్ గా ఉన్న ఆదిత్య ఒక్కొక్కరి పేరు పిలుస్తాడు వారు వచ్చి మీ అనుబంధం గురించి చెప్పండి ' అని అన్నాడు.

మొదటగా ఆదిరెడ్డి తన గురించి మాట్లాడుతూ... 'మా అమ్మ 2013 లో బాత్రూంలో ఉరి వేసుకొని చనిపోయింది. అప్పట్లో మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ అప్పుల బాధ తట్టుకోలేక అమ్మ ఉరి వేసుకొని చనిపోయింది. నా అంత హైట్ లో ఉండేది మా అమ్మ. బాత్రూం కాస్త ఎత్తులో ఉండేది అంతే, దానికి ఉరి వేసుకొని చనిపోయింది అంటే ఎంత నరకం అనిపించిందో పాపం'. అది చూసి కంటెస్టెంట్స్ కూడా ఏడ్చేసారు. 'అందుకే అందరికీ చెప్తున్నా కష్టాలు ఉన్నాయని ఎవరూ సూసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కష్టాలు అనుభవించినవారే, తర్వాత సంతోషంగా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవడానికైనా మనం బ్రతికుండాలి. మన వాళ్ళ కోసం అయినా మనం బ్రతికుండాలి ' అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

'నాకు బేబీ పుట్టకుముందు పిల్లలు అంటే అంత ఇష్టం ఉండేదీ కాదు. మా అక్కకు కళ్ళు కనపడవు. నేనే ఇల్లు చూసుకునేవాడిని. నా భార్య డెలివరీ టైం లో నేను నెల్లూరు వెళ్లాను. బేబీ పుట్టిన తర్వాత ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది. బేబీ కళ్ళు సరిగ్గా చూడట్లేదని చెప్పారు. వెంటనే నేను వచ్చేసాను. తర్వాత డాక్టర్ కి తీసుకెళ్ళి చూపించాను.కళ్ళు బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత మా అమ్మ పుట్టింది అని చాలా సేపు ఏడ్చాను. ఆ క్షణం నుండి కంటికిరెప్పలా చూసుకుంటున్నాను. అయితే బేబీ పుట్టినప్పుడు నువ్వు నా పక్కన లేవు అని ఇప్పటికీ నా భార్య నన్ను అంటూనే ఉంటుంది. నా కూతురు పేరు 'అద్విత'. అందుకే నిన్న జరిగిన సిసింద్రీ టాస్క్ లో ఇచ్చిన బేబీని అద్విత అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నా' అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

పదకొండో‌ రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.