English | Telugu
కండక్టర్ ఝాన్సీ కి పోటీగా నెల్లూరు కవిత!
Updated : Oct 12, 2022
ప్రతీ ఆదివారం మధ్యాహ్నం బుల్లితెర మీద ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ఈ స్టేజిపై కామెడీ స్కిట్స్ మాత్రమే కాదు కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తుండడంతో ప్రతీ వారం కొత్త కొత్తగా కనిపిస్తోంది ఈ షో. ఈ వారం ఎపిసోడ్ ని ‘హైపర్ ఆది’ బర్త్ డే స్పెషల్ గా ప్లాన్ చేశారు. ఇక ఈ వారం హైపర్ ఆది తన బర్త్ డే అంటూ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో ఫన్ చేశారు. రష్మీ కూడా ఆదిని తిట్టేసింది. "ఒక ఎదవ బర్త్ డే కి వచ్చాం" అనేసరికి "ఎదవ కాదు ఎదవన్నర" అన్నారెవరో అంటూ ఇంద్రజ కూడా కౌంటర్ వేసింది. ఇక తర్వాత " శ్రీరామదాసు" మూవీలోని "తాగరా శ్రీరామ నామామృతం" అనే భక్తి గీతాన్ని హైపర్ ఆది, నూకరాజు పాడి అందరినీ ఫిదా చేసేసారు. ఈ పాటకి స్టేజి మొత్తం లేచి చప్పట్లు కొట్టారు.
ఇక ఫైనల్ గా నెల్లూరు నుంచి కవిత అనే కొత్త డాన్సర్ ని తీసుకొచ్చారు. గాజువాక కండక్టర్ ఝాన్సీ ఈ స్టేజి ద్వారానే మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాను ఝాన్సీకి మించిన టాలెంట్ తో వచ్చానని చెప్పింది కవిత. తర్వాత ఇద్దరి మధ్యా డాన్స్ పోటీ జరిగింది. హోరాహోరీగా డాన్స్ చేసేసారు ఇద్దరూ. మరి నెల్లూరు కవిత, ఝాన్సీ మధ్య ఎలాంటి పోటీ జరిగింది..ఎవరు బాగా చేశారు. ఝాన్సీ ప్లేస్ లో ఇక నుంచి నెల్లూరు కవిత కనిపిస్తుందా ? తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.